Heavy Rains | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీచేసింది. వాగులు, వంకలు ఉన్న ప్రాంతాల్లోనివారు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
21న నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో అకడకకడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 22న ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేరొన్నది.
23న ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, నిర్మల్, కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాల్లో అకడకకడ వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.