హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తేతెలంగాణ) : తెలంగాణవ్యాప్తంగా 15 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. 10, 11 తేదీల్లో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబుబాబాద్, నాగర్కర్నూల్ జిల్లాలో భారీ వానలు పడతాయని వెల్లడించారు.
12, 13, 15 తేదీల్లో ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నదని పేర్కొన్నారు.