హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సోమ, మంగళవారాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర–దక్షిణద్రోణి తూర్పు విదర్భ నుంచి దక్షిణ కోస్తాంధ్ర వరకు విస్తరించి, సముద్ర మట్టానికి 0.9కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్నదని వెల్లడించింది. పశ్చిమ, నైరుతి దిశ నుంచి రాష్ట్రంలోకి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని పేర్కొన్నది.
కాగా, హైదరాబాద్లో ఆకాశం మేఘావృతమై ఉంది. సోమవారం తెల్లవారుజామున నగరంలో అక్కడక్కడ వర్షం కురిసింది. ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్, మలక్పేట, కోఠి, ఉప్పల్, నాగోల్లో చిరుజల్లులు కురిశాయి.