న్యూఢిల్లీ, మార్చి 17: పశ్చిమాసియాలో రెండు వారాలకు పైగా కొనసాగుతున్న యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో చమురు, గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడింది. అయితే ఈ యుద్ధం వల్ల కేవలం ఈ రెండింటికే కాదు సాధారణ ప్రజలకు అంతగా తెలియని పారిశ్రామిక పరంగా కీలకమైన హీలియం వాయువుకు కూడా అనూహ్యంగా కొరత ఏర్పడింది. హెల్త్‌కేర్, సెమీకండక్టర్ల తయారీ, ఇతర అధునాతన సాంకేతిక రంగాల్లో దీన్ని విరివిగా వినియోగిస్తారు. ప్రపంచ దేశాలకు అవసరమైన హీలియం గ్యాస్ గల్ఫ్‌లోని ఒక్క ఖతార్ నుంచే 30-38 శాతం సరఫరా అవుతున్నది. యూఎస్ సహా పలు దేశాల్లో అది 70-75 శాతం ఉత్పత్తికి తోడ్పాటు అందిస్తున్నది.