ముదిగొండ, ఏప్రిల్ 14 : కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనకపోవడంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిచిపోయిందని ఆగ్రహిస్తూ రైతులు సోమవారం ధర్నాకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై తడిసిన ధాన్యంతో ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున తమ ధాన్యం కాంటా వేయాలని అధికారులను కోరినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సెలవుల పేరుతో ఇప్పటివరకు కాంటాలు పెట్టలేదని ఆరోపించారు. ఎప్పటికప్పుడు కాంటాలు వేస్తే ఈ పరిస్థితి వచ్చేది కాదని, ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు.