హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో గురు, శుక్ర, శనివారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ప్రకటించింది. గురు, శుక్రవారాల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతాయని హెచ్చరించింది. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలతో పాటు నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లోనూ వర్షాలు పడుతాయని తెలిపింది. ఆదివారం ఆదిలాబాద్, కుమ్రంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తాపైన 3.1 కిలోమీటర్లు ఎత్తులో ఆవర్తనం ఏర్పడిందని పేర్కొన్నది