హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం (Heavy Rain) కురిసింది. మంగళవారం తెల్లవారు జాము నుంచి హైదరాబాద్ వ్యాప్తంగా వాన దంచికొట్టింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పార్సిగుట్టలో వర్షపు నీటిలో గుర్తుతెలియని వ్యక్తి గల్లంతయ్యాడు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, పంజాగుట్ట, అమీర్‌పేట, ఎస్ఆర్నగర్, కొంపల్లి, మాదాపూర్, దిల్సుఖ్నగర్, కొత్తపేట, సరూర్‌నగర్, ఎల్బీనగర్, నాగోల్, అల్కాపురి, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట, అబ్దుల్లాపూర్‌మెట్ భారీ వర్షం కురిసింది.
మలక్‌పేట, ఖైరతాబాద్, నాంపల్లి, బషీర్‌బాగ్, హిమాయత్ నగర్, అబిడ్స్, నాంపల్లి, కుత్బుల్లాపూర్, బాలానగర్, గాజులరామారం, జగద్గిరిగుట్ట, బహదూర్ పల్లి, సూరారం, సుచిత్ర, గుండ్ల పోచంపల్లి, పేట్ బషీరాబాద్, జీడిమెట్ల, నాగారం, కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, కూకట్పల్లి, ఆల్విన్‌కాలనీ, హైదర్‌నగర్, కేపీహెచ్‌బీ కాలనీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట, ప్రగతినగర్, ముషీరాబాద్, రామ్‌నగర్, పార్సిగుట్ట, బౌద్ధనగర్‌లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. దీంతో రోడ్లలన్నీ చెరువులను తలపిస్తున్నాయి. పలుచోట్ల మోకాలిలోతు వరకు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఆర్వోబీ నీట మునగడంతో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మలక్‌పేట రైల్వే స్టేషన్ నుంచి ముసారాంబాగ్, సంతోష్‌నగర్ వరకు, కోఠీ వైపు చాదర్‌ఘాట్ వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఇక ఉస్మానియా మెడికల్ కాలేజీవద్ద రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయింది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పార్సిగుట్టలో భారీగా వరద రావడంతో లు ప్రాంతాలు ప్రమాద అంచుల్లో ఉన్నాయి. గుర్తుతెలియని వ్యక్తి వర్షపు నీటిలో కొట్టుకుపోయారు. కొన్ని కార్లు కొట్టుకుపోయాయి. కాగా, నగరంలో మరో 2 గంటలపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. భారీ వర్షాలకు జీహెచ్ఎంసీ, డిజాస్టర్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏదైనా సమస్యకు టోల్‌ఫ్రీ 040-21111111, 9000113667కు సంప్రదించాలని తెలిపారు.
Severe Thunderstorm visuals in Hyd!#HyderabadRains pic.twitter.com/XyFGJd6NZW
— Piyush Darak (@darak_piyush) August 20, 2024
Today Early Morning Insane Lightning ⚡ Strikes in #Hyderabad 😳
516KA 😱😱😱 Strike near #Miyapur Metro Depot 🙏 at 5:44AM
More Details Below👇#HyderabadRains pic.twitter.com/UYOmVINO1c
— Hyderabad Rains (@Hyderabadrains) August 20, 2024
@Hyderabadrains This is second time I have seen heavy rain water in our area @dabeerpura
@chaderghat @yakutpura @chaderghat @malakpet pic.twitter.com/L85DwZFz2U— shaik dawood (@ShaikDawoodSufi) August 20, 2024