హైదరాబాద్ : తెలంగాణ భవన్( Telangana Bhavan) వద్ద భారీ పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ(Arekapui Gandhi) మధ్య నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో.. తెలంగాణ భవన్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులను మోహరించారు. కాగా, ఎమ్మెల్యే అరికపూడి గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం పీఏసీ చైర్మన్‌గా ప్రకటించినప్పటి నుంచి విమర్శల పర్వం మొదలైంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి.
తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి (MLA Padi Kaushik Reddy) నివాసంపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన ఇంటిపై కోడి గుడ్లు, టమాటాలు విసిరేశారు. అక్కడే ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలపై కుర్చీలతో దాడికి దిగారు. ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. సవాళ్లు, ప్రతిసవాళ్ల నడుమ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ.. కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసానికి తన అనుచరులతో కలిసి వెళ్లారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే గాంధీ అనుచరులు పోలీసులను తోసుకుంటూ ఇంట్లోకి వెళ్లేందుకు యత్నించారు.
ఈ క్రమంలో గేటు దూకి కౌశిక్ రెడ్డి ఇంట్లోకి చొచ్చుకెళ్లిన కాంగ్రెస్ కార్యకర్తలు.. అక్కడే ఉన్న బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. కోడిగుడ్లు, టమాటాలు విసిరేశారు. ఇంటి అద్దాలను కుర్చీలతో ఇంటి అద్దాలను పగులగొట్టారు. పోలీసులపై చేయిచేసుకున్నారు. ఇంత జరుగుతున్నా గాంధీ అనుచరులు, కాంగ్రెస్ గూండాలను పోలీసులు నిలువరించలేకపోవడం గమనార్హం. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు క్యాంప్ ఆఫీస్‌పై దాడి ఘటన మరువక ముందే కౌశిక్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు విధ్వంసం సృష్టించడం విశేషం.