ఖమ్మం : గంజాయి కట్టడికి అధికారులు(Excise officials) ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎక్కడి కక్కడ తనిఖీలు చేస్తూ గంజాయిని సీజ్ చేస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లాలో(Khammam district) భారీగా గంజాయిని(Heavy ganja) ఎక్సైజ్ అధికారులు దగ్ధం చేశారు. వివరాల్లోవెళ్తే .. జిల్లాలోని ఆరు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ల పరిధిలో 72 కేసుల్లో పట్టుకున్న 1120 కేజీల గంజాయిని ఖమ్మం డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి పర్యవేక్షణలో మంగళవారం దగ్ధం చేశారు. ఎవరైనా గంజాయి అమ్మినా, కొనుగోలు చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. యువత గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.