హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో(Heavy rains) మహారాష్ట్ర నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద ఉధృతి కొనసాగుతోంది. తెలంగాణలో సైతం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు నిండు కుండలా మారాయి. వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. తాజాగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు(SRSP) వరద ఉధృతి(Huge Flood) కొనసాగుతోంది. మహారాష్ట్ర నుంచి 2 లక్షల 77 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా 2,45,000 క్యూసెక్కుల ఔట్ ఫ్లోను 41 వరద గేట్ల ద్వారా దిగువకు వదులుతున్నారు.
ఇన్ ఫ్లో కంటే ఔట్ ఫ్లో ఎక్కువగా ఉండటంతో 41 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఎస్సారెస్పీలో గరిష్ఠ నీటిమట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1089 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం 73 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు.