హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ) : సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్‌పై అనుచిత ఆరోపణలు చేశానన్న అభియోగాలతో తనపై ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరుతోపాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లి, సైఫాబాద్ పోలీస్ స్టేషన్లలో నమోదైన కక్ష సాధింపు కేసులను కొట్టేయాలని కోరుతూ బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. వాటిపై జస్టిస్ కే లక్ష్మ ణ్ మంగళవారం విచారణ చేపట్టారు. పిటిషనర్ తరఫున న్యాయవాది టీవీ రమణరావు వాదనలు వినిపిస్తూ.. కేటీఆర్ ఎవరిపైనా వ్యక్తిగత ఆరోపణ లు చేయలేదని, అయినప్పటికీ కాంగ్రె స్కు చెందిన ఆత్రం సుగుణ, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్, చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న ఈ కేసులు దాఖలు చేశారని వివరించా రు. రాజకీయ కక్షసాధింపుతో నమోదై న ఈ కేసులను కొట్టివేయాలని కోరా రు. దీంతో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆత్రం సుగుణ, ఎంపీ అనిల్ కుమార్‌యాదవ్‌కు నోటీసులు జారీచేసిన జస్టిస్ విచారణను మార్చి 18కి వాయిదా వేశారు. తీన్మా ర్ మల్లన్న ఫిర్యాదుతో నమోదైన కేసు ను కొట్టేయాలన్న పిటిషన్‌పై విచారణ ను చేపట్టలేనని స్పష్టంచేశారు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఆ పిటిషన్‌ను మరో ధర్మాసనం ముం దుంచాలని హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌ను ఆదేశించారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని బార్ అసోసియేషన్లకు, బార్ కౌన్సిల్‌కు మధ్య నెలకొన్న ఎన్నికల వివాదంపై హైకోర్టులో విచారణ 27కు వాయిదా పడింది. బార్ అసోసియేషన్ల ఎన్నిక ల్లో జోక్యం చేసుకోకుండా బార్ కౌన్సిల్‌ను నిరోధించాలని, అసోసియేషన్ల కాలపరిమితిని రెండేండ్లు పెంచలేమం టూ కౌన్సిల్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలని కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్, 24 కోర్టు ల అసోసియేషన్లు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్‌రెడ్డి మంగళవారం మరోసారి విచారణ చేపట్టారు.