కుమ్రం భీం ఆసిఫాబాద్ : కుమ్రం భీం జిల్లాలో( Kumram Bhim) ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ ఆక్సిడెంట్లో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్(Head constable 0దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. సిర్పూర్ టీ మండలం వేంపల్లి సమీపంలో రెండు బైకులు ఢీకొన్న ఘటనలో ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాథోడ్ శంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.