ఖమ్మం, ఆగస్టు 18: ప్రజా యుద్ధనౌక గద్దర్ పాట అజరామరమని ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. వామపక్ష, విప్లవ, కళాకారులు, సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం నిర్వహించిన ‘గద్దర్, జహీర్ అలీ’ సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు. గద్దర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొ న్నారు. ఫాసిజం రాజ్యమేలుతున్న సమయం లో గద్దర్ పాట గళమెత్తిందని గుర్తుచేశారు. గద్దర్ అంతిమయాత్రలోనే పాత్రికేయుడు, సంపాదకుడు జహీర్అలీ మృతిచెందడం ప్రజా ఉద్యమానికి తీరని లోటని అన్నారు.