హైదరాబాద్: ఇందిరమ్మ పాలన అంటే హౌస్ అరెస్టులు, మీడియాపై ఆంక్షలు పెట్టడమా అని రేవంత్ రెడ్డి సర్కార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్ససు ప్రయాణం కల్పించి, పురుషులకు బస్ టికెట్ డబుల్ చేశారని విమర్శించారు. పండుగలంటూ అడ్డదిడ్డంగా డబుల్ చార్జీలు వసూలు చేశారంటూ ధ్వజమెత్తారు. ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచితే ప్రజలు మెట్రో రైలు ఎక్కుతారని చూస్తున్నారా అని నిలదీశారు. చలో బస్ భవన్ కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘బస్ చార్జీల పెంపుపై బస్సుల్లో బస్ భవన్‌కు వెళ్లి ఆర్టీసీ ఎండీకి పిటిషన్ ఇవ్వాలనుకున్నాం. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శాంతియుతంగా కార్యక్రమం చేపట్టాం. ఇంతదానికే హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. తెల్లవారు జామునుంచే తమ నాయకులను ఎందుకు అరెస్టు చేస్తున్నారని నిలదీశారు. హౌస్ అరెస్టులు, అక్రమ అరెస్టులు రేవంత్ రెడ్డి నిరంకుశత్వానికి నిదర్శమని చెప్పారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధమైన ఇలాంటి చర్యలు ఖండిస్తున్నాం. ఇందిరమ్మ పాలన అంటే హౌస్ అరెస్టులు.. మీడియాపై ఆంక్షలు పెట్టడమా అని ధ్వజమెత్తారు.
రేవంత్ రెడ్డి వచ్చిన 22 నెలల్లోనే ఐదుసార్లు బస్ చార్జీలు పెంచారు. మహిళలకు ఫ్రీ ఇచ్చి పురుషులకు బస్ టికెట్ డబుల్ చేశారు. పండుగలంటూ అడ్డదిడ్డంగా డబుల్ చార్జీలు వసూలు చేశారు. బస్ పాసులు తీసుకోవాలనుకుంటే వాటి ధరలనూ పెంచారు. రైతులకు విత్తనాల ధరలు పెంచి, రుణమాఫీ చేయలేదు. ఆర్జీసీ బస్సు చార్జీలను పెంచితే మెట్రో రైలు ఎక్కుతారని చూస్తున్నారా అని ప్రశ్నించారు. తమ హయాంలో ఆర్టీసీ కార్మీకుల సంక్షేమానికి రూ.9 వేల కోట్లు గ్రాంటుగా ఇచ్చాం. మహాలక్ష్మి కింద ఇవ్వాల్సిన డబ్బులు సైతం ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పీఎఫ్ డబ్బులు ఇవ్వడం లేదు. మేనిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీని ప్రైవేటికరించే కుట్ర కనబడుతున్నది. ఎలక్ట్రిక్ బస్సులు వస్తే ఆర్టీసీ డ్రైవర్లు ఎవరూ ఉండరు.
కమీషన్ల కోసం బడా కాంట్రాక్టర్లకు ఎలక్ట్రిక్ బస్సులను కట్టబెట్టాలని చూస్తున్నారు. ఎంతో చరిత్ర ఉన్న ఉప్పల్, మియాపూర్ వర్క్‌షాపులను అమ్మేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఆర్టీసీని కుదువపెడుతూ, ఆస్తులు అమ్ముకుంటున్నాడు. బీఆర్ఎస్ ప్రభుత్వం కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసింది. కార్గో వ్యవస్థను తెచ్చి కేసీఆర్ ఆర్టీసీని లాభాల బాట పట్టించారు. రాహుల్ మాటల్లోనే రాజ్యాంగ రక్షణ.. రేవంత్ పాలనలో రాజ్యాంగ భక్షణ. కార్గోను అడ్డికి పావుసేరుకు రేవంత్ అనత అనుయాయులకు కట్టబెడుతున్నారు. ఆర్టీసీ బాగుపడటం రేవంత్ రెడ్డికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆర్టీసీకి ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లాంచాలని డిమాండ్ చేస్తున్నాం. పేద ప్రజలపై భారం వేసి వారి నడ్డి విరిచే పనులు మానుకోండి. టోల్గేట్, పండుగల పేరుతో జరుగుతున్న దోపిడీని ఉపసంహరించుకోవాలి. ఆర్టీసికి ఇవ్వాల్సిన గ్రాంట్లు ఇచ్చి సంస్థను ఆదుకోవాలి. ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గే వరకు మా పోరాటం ఆగదు. వివిధ రూపాల్లో నిరసన తెలుపుతూనే ఉంటాం.