హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ప్రారంభమైన రెండు నిమిషాలకే వాయిదా వేయటం ఏమిటని మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం ఎక్స్‌వేదికగా నిలదీశారు.
క్యాబినెట్ సమావేశం ఇంకా కొనసాగుతున్నదని, సబ్జెక్టు నోట్స్ సిద్ధం చేయలేదని సభను వాయిదా వేయాలని మంత్రి శ్రీధర్‌బాబు కోరడం హాస్యాస్పదంగా ఉన్నదని పేర్కొన్నారు. ‘నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ ప్రిపేర్ కాలేదు. నేడు పాలక పక్షంలో ఉన్నా ప్రిపేర్ కాలేదు. ఇంకెప్పుడు ప్రిపేరవుతరు?’ అని చురకలంటించారు.