హైదరాబాద్, మార్చి 30 (నమస్తే తెలంగాణ) : ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మాజీ మంత్రి హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో విజయాలు సిద్ధించి, సకాలంలో వర్షాలు కురిసి, సాగునీరు పుష్కలంగా లభించి, పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐష్టెశ్వర్యాలతో జీవించాలని మనసారా కోరుకున్నానని తెలిపారు.