హైదరాబాద్: బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలందరికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించించి వారిని ఘనంగా గౌరవించుకున్నామని గుర్తుచేశారు.
బంజారాల ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీసేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా గిరిజన బిడ్డలందరికీ శుభాకాంక్షలు.
ఆ మహనీయుడు చూపిన ఆదర్శమార్గంలో మానవ శ్రేయస్సు కోసం మనందరం కృషి చేయాలి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించించి వారిని ఘనంగా… pic.twitter.com/GJnrPG8ruo— Harish Rao Thanneeru (@BRSHarish) February 15, 2025
కాగా, సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు. వేడుకలకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు, గిరిజన ప్రముఖులు హాజరుకానున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 16 కోట్ల మంది గిరిజనులకు సేవాలాల్ మార్గదర్శి, ఆదర్శప్రాయుడు. కేసీఆర్ హయాంలోనే సేవాలాల్ మహారాజ్‌కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. సేవాలాల్ పుట్టి పెరిగిన మహారాష్ట్రలో కూడా ఆయన జయంతిని సర్కారు అధికారికంగా నిర్వహించడం లేదు. అయితే కేసీఆర్ హయాంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించడం మొదలైంది.