హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రతినిధులను అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించేందుకు వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించడాన్ని ఖండించారు. పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం? పురుగుల అన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెకి నినదిస్తుంటే చీమకుట్టినటైనా లేదా? మంచి భోజనం పెట్టని దీనస్థితిలో ఈ ప్రభుత్వం ఉన్నదా? అని నిలదీశారు. అరెస్టు చేసిన రామ్మోహన్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులకు విడుదల చేయాలి’ అని బుధవారం ఎక్స్ వేదికగా హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ‘ప్రతిపక్షాల గొంతు నొకడం కాదు.. ఫుడ్ పాయిజన్ వల్ల దవాఖాన పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోండి’ అని సీఎం రేవంత్‌రెడ్డికి హితవుపలికారు.
నిర్బంధాలతో అణిచివేయాలనుకుంటే మూర్ఖత్వం
తెలంగాణ గడ్డ పోరాటాల పురిటిగడ్డ. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజా తిరుగుబాటును అణిచివేయాలనుకోవడం ప్రభుత్వ మూర్ఖ త్వం. ‘చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతున్నది. మాగనూరు జడ్పీ హైసూల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది. ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ పెద్దలు గొప్పలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, కార్యకర్తల ముందస్తు అరెస్టును తీవ్రంగా’ అని బుధవారం ఎక్స్ వేదిక కవిత పేర్కొన్నారు.
-కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ
నిరసన తెలపడం నేరమా?
విద్యార్థుల పక్షాన నిరసన తెలపడం నేరమా? రేవంత్‌రెడ్డి నియంతృత్వానికి ఇది పరాకాష్ట. మంగళవారం మరోసారి ఆహారం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయమై మాగనూరులో ధర్నాకు సిద్ధమవుతున్నారనే సమాచారంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణం.
-దాసోజు శ్రవణ్, బీఆర్ఎస్ నాయకుడు
వేడినూనె పడి విద్యార్థినికి గాయాలు
నవాబ్‌పేట, నవంబర్ 27: మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలోని కేజీబీవీ పాఠశాలలో మంగళవారం సి బ్బంది పూరీలు చేస్తుండగా, ఆలస్యమవడంతో టీచర్లు వి ద్యార్థులతో కూడా పూరీలు చేయించారు. దీంతో కడాయి లో పూరీలు వేసే క్రమంలో వేడి నూనె చిట్లి తొమ్మిదో తరగతికి చెందిన జల్సా అనే అమ్మాయిపై పడటంతో చేతికి, కాలికి గాయాలుకాగా బుధవారం వెలుగులోకి వచ్చింది. బుధవారం విద్యార్థిని తల్లి యాదమ్మ అమ్మాయిని తీసుకెళ్లి వైద్యం చేయించుకొని సొంతూరికి తీసుకెళ్లింది.
‘భోజన’ పర్యవేక్షణకు ఫుడ్ కమిటీ
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): మధ్యాహ్న భోజనం పర్యవేక్షణకు ఫుడ్ కమిటీని ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, టీచర్లతో కలిపి ఫుడ్ కమిటీని ఏర్పాటుచేశారు.