భద్రాచలానికి పోలవరం జలగండం.. ఆ ప్రాజెక్టు నిండితే, 13.15 నుంచి 17.72 మీటర్ల నీటి ముంపులో భద్రాచలం
ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, చుట్టుపకల ప్రాంతాలకు పొంచి ఉన్న బ్యాక్‌వాటర్ ముప్పు పై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. ప్రస్తు త ప్రభుత్వం ముంపు బాధితుల సమస్యలను పట్టించుకోకపోతే తాము బాధితులకు అండగా ఉంటామని స్పష్టంచేసింది.
- 2022నాటి బ్యాక్‌వాటర్‌తో భద్రాచలం, బూర్గంపహాడ్, సారపాక అతలాకుతలం
- ఆ ప్రాంతంలోని పరిశ్రమలకూ ముప్పే
- 2,000 బాధిత కుటుంబాలకు నష్టపరిహారం, పూర్తిస్థాయి శాశ్వత పునరావాసం కల్పించాలి
- లేనిపక్షంలో బాధితుల పక్షాన పోరాటం చేస్తాం
- పీపీఏ సీఈవోకు హరీశ్‌రావు లేఖ
- అందజేసిన భద్రాచలం, పినపాక బీఆర్ఎస్ నేతలు
హైదరాబాద్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : ఏపీ నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని భద్రాచలం పట్టణానికి, చుట్టుపకల ప్రాంతాలకు పొంచి ఉన్న బ్యాక్‌వాటర్ ముప్పు పై బీఆర్ఎస్ పార్టీ మరోసారి గళమెత్తింది. ప్రస్తుత ప్రభుత్వం ముంపు బాధితుల సమస్యలను పట్టించుకోకపోతే తాము బాధితులకు అండగా ఉంటామని స్పష్టంచేసింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సీఈవోకు బీ ఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్, మాజీ మం త్రి హరీశ్‌రావు గురువారం లేఖ రాశారు. ప్రస్తు తం భద్రాచలంలో పర్యటిస్తున్న పీపీఏ అధికారుల బృందానికి పినపాక, భద్రాచలం నియోజకవర్గాల బీఆర్ఎస్ నాయకులు స్వయంగా ఈ లేఖను అందజేశారు. పోలవరం పూర్తయితే తెలంగాణ ఎదురోబోయే భయానక పరిస్థితులను హరీశ్‌రావు ఈ లేఖలో గణాంకాలు సహా వివరించారు. ‘పోలవరం పూర్తిస్థాయి నీటిమ ట్టం 45.72 మీటర్లు కాగా, భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి కూడా సరి గ్గా 45.72 మీటర్లే. దీనర్థం ప్రాజెక్టు నిండితే, భద్రాచలం ఎప్పుడూ ముంపు ప్రమాదంలోనే ఉంటుంది. భద్రాచలం వద్ద గోదావరి నది లో తైన బెడ్ లెవల్ 26 మీటర్లు. బ్యాక్‌వాటర్ ప్రభావం వల్ల భద్రాచలంలో ఎప్పుడూ 13.15 మీటర్ల నుంచి 17.72 మీటర్ల మేర నీరు నిల్వ ఉంటుంది. ఇది నిత్యం ఒక జలగండంలా మా రబోతున్నద’ని హరీశ్‌రావు హెచ్చరించారు.
2022 నాటి నష్టమే నిదర్శనం
2021లో పోలవరం కాఫర్‌డ్యామ్ నిర్మాణం పూర్తయిన తర్వాత, 2022లో వచ్చిన బ్యాక్‌వాటర్ కారణంగా భద్రాచలం, బూర్గంపహాడ్, సారపాక ప్రాంతాలు అతలాకుతలమయ్యాయని హరీశ్‌రావు గుర్తుచేశారు. అప్పట్లో 40% భద్రాచలం పట్టణం జలమయమై, లక్ష మందికిపైగా ప్రజలు రోడ్డునపడ్డారని వివరించారు. అప్పట్లో 22 లక్షల క్యూసెకుల వరదకే అంత నష్టం జరిగితే.. భవిష్యత్తులో ప్రాజెక్టు డిజైన్ ప్రకారం 36 లక్షల నుంచి 50 లక్షల క్యూసెకుల వరద వస్తే తెలంగాణకు ఊహించని ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఐఐటీ, వ్యాపోస్ అధ్యయనాల ప్రకారం.. 36 గ్రామాల పరిధిలోని 184 చదరపు కిలోమీటర్ల మేర ముంపు ప్రభావం పడుతుందని గుర్తుచేశారు. కేవలం గ్రామాలే కాకుండా, ఈ ప్రాంతంలోని భారీ పరిశ్రమలకు కూడా బ్యాక్‌వాటర్ ముప్పు పొంచి ఉన్నదని లేఖలో పేరొన్నారు. దాదాపు ఐదువేల కుటుంబాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఐటీసీ పేపర్‌బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెం జలవిద్యుత్తు ప్రాజెక్టులకు ఈ బ్యాక్‌వాటర్ వల్ల తీవ్ర ప్రమాదం వాటిల్లే అవకాశం ఉన్నదని వివరించారు.
వారికి శాశ్వత పునరావాసం కల్పించాలి
పోలవరం ప్రాజెక్టు ముంపు వల్ల పదేపదే నష్టపోతున్న సుమారు రెండు వేల బాధిత కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారంతోపాటు పూర్తిస్థాయి శాశ్వత పునరావాసం కల్పించాలని హరీశ్‌రావు ఆ లేఖలో డిమాండ్ చేశారు. భద్రాచలం వద్ద కొత్తగా ఐదు కిలోమీటర్ల మేర కరకట్టల నిర్మాణం చేపట్టాలని, బూర్గంపహాడ్, సారపాక తదితర ముంపు గ్రామాలకు రక్షణ గోడలు నిర్మించాలని కోరారు. భద్రాచలం డ్రైనేజీ వ్యవస్థకు అనుసంధానంగా ఉన్న ఎనిమిది అవుట్‌ఫాల్ రెగ్యులేటర్లు బ్యాక్‌వాటర్ వల్ల మూసుకుపోతున్నాయి కాబట్టి, పట్టణ వరద నీటిని గోదావరిలోకి పంపేందుకు తక్షణమే పంపింగ్ స్టేషన్లు, ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పరిధిలో పోలవరం ముంపు సమస్యల పరిషారం, రక్షణ పనుల పర్యవేక్షణ కోసం భద్రాచలంలోనే ప్రత్యేకంగా పీపీఏ డివిజన్ ఆఫీసును ఏర్పాటు చేయాలని కోరారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాలే పరమావధిగా బీఆర్ఎస్ పార్టీ ఈ పోరాటాన్ని కొనసాగిస్తుందని, పోలవరం అథారిటీ తక్షణమే స్పందించి ఈ చర్యలు చేపట్టాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

