హైదరాబాద్, ఆగస్టు 10 (నమస్తే తెలంగాణ) : ఎల్ నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితుల్లో సాగునీరు లేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారని, రాజకీయాలు పక్కన పెట్టి వెంటనే రైతుల కు కాళేశ్వరం నీళ్లివ్వాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు సోమవారం ఆయన లేఖ రాశారు. ప్రాజెక్టుల్లో సకాలం లో నీరు నింపకపోవడం వల్ల పంటల సాగు ముందుకు సాగక రైతులు ఇబ్బందు లు పడుతున్నందున, కాళేశ్వరం మోటర్లు ఆన్ చేసి రిజర్వాయర్లలోకి నీటిని పంపింగ్ చేయాలని, అటునుంచి చెరువులను నిం పాలని లేఖలో పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని అన్నపూర్ణ(అనంతగిరి), రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, నృసింహ(బస్వాపూ ర్) రిజర్వాయర్లతోపాటు వాటి అనుబంధ చెరువులు, చెక్‌డ్యామ్‌లను వెంటనే నింపాలని లేఖ ద్వారా హరీశ్‌రావు సూచించారు.
మిడ్‌మానేరు నుంచి పంపింగ్ ప్రారంభించడం ద్వారా సుమారు 4లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతులకు సాగునీరు అందుతుందని తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల లభ్యమవుతున్న ప్రతి నీటి చుకనూ ఒడిసిపట్టి ప్రాజెక్టు పంపుల ద్వారా నింపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నదని చెప్పారు. ప్రస్తుతం మిడ్‌మానేరు 27టీఎంసీలులకు గాను 22 టీఎంసీల నీరుంటే.. లోయర్ మానేరు డ్యామ్(ఎల్ఎండీ)లో కేవలం 6.9 టీఎంసీలే ఉన్నాయని.. వెంటనే మిడ్‌మానేరు నుంచి ఎల్ఎండీకి నీటిని మళ్లించి నింపడం ద్వారా ఎస్సారెస్పీ స్టేజ్-2 ఆయకట్టు రైతులకు సకాలంలో నీరందించి ఆదుకోవచ్చని విజ్ఞప్తి చేశారు. గత యాసంగిలో కాళేశ్వరంపై రిజర్వాయర్ల పరిధిలో 4లక్షల ఎకరాల్లో పంటలు సాగైన విషయాన్ని హరీశ్‌రావు గుర్తుచేశారు. ప్రస్తుత వానకాలం పంటతోపాటు రాబోయే యాసంగి సాగుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ఇప్పటినుంచే కాలువలు, చెరువులను నీటితో పూర్తిస్థాయిలో నింపాలని, రైతాంగంలో నెలకొన్న అభద్రతాభావాన్ని తొలగించేందుకు ప్రభుత్వం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పంపింగ్ ప్రక్రియను ప్రారంభించాలని కోరారు.