రేవంత్ రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నయి. రియల్ఎస్టేట్ కుప్పకూలింది. కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు, ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు కడితే రేవంత్ పేదల ఇండ్లు కూల్చుతున్నడు. నాడు ఇన్వెస్ట్మెంట్ హబ్‌గా ఉన్న హైదరాబాద్ నేడు ఇన్సెక్యూరిటీ హబ్‌గా మార్చిండు.
-హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆరు గ్యారెంటీలను ఎగవేసి.. ధరలు పెంచుతూ.. కమీషన్లను నొక్కుతూ.. అరాచకాలు, బ్లాక్‌మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్కు ఓటేసి కాంగ్రెస్‌కు కనువిప్పు కలిగించాలని, పేదల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నాలుగు లక్షల మందికి సంబంధించినది కాదని, రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నికని పేర్కొన్నారు. గ్యారెంటీలను ఎగవేసిన కాంగ్రెస్, గ్యారెంటీలను అమలుచేయాలని గల్లాపట్టి నిలదీస్తున్న బీఆర్ఎస్కు మధ్యనే పోటీ అని స్పష్టంచేశారు. ఉపఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతున్నదని, ఆఖరికి ఆడబిడ్డ కన్నీళ్లనూ అవమానిస్తున్నదని ధ్వజమెత్తారు. ధరలు పెంచుడు.. కమీషన్లు దంచుడు తప్ప కాంగ్రెస్ చేసిందేమీలేదని విమర్శించారు. పేదోళ్ల వరకే హైడ్రా కూల్చివేతలు ఎందుకని, దమ్ముంటే పెద్దోళ్ల ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర బలగాల పహారాలో ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘మీట్ ది ప్రెస్’ నిర్వహించారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో, సీనియర్ జర్నలిస్ట్ దొంతు రమేశ్ సమన్వయకర్తగా వ్యవహరించగా.. హరీశ్‌రావు పలు అంశాలపై మాట్లాడారు.
నలుగురు బ్రదర్స్ మాత్రమే హ్యాపీ
సీఎం రేవంత్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని, నలుగురు రేవంత్ బ్రద ర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారని హరీశ్‌రావు ఎద్దేవాచేశారు. కేసీఆర్ పాలనలో వికాసం.. రేవంత్ పాలనలో విధ్వంసం.. ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని కోరారు. రేవంత్‌రెడ్డి బ్లాక్‌మెయిలరని వ్యాఖ్యానించారు. సమాచా ర హకు చట్టాన్ని ఉపయోగించి రియల్టర్లు, వ్యాపారవేత్తలు, సమ్మెచేసిన సినీ కార్మికులను సైతం బ్లాక్మెయిల్ చేశారని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అడిగితే కాలేజీల మీద విజిలెన్స్, పోలీసుల దాడులు చేస్తూ, ఆరోగ్య శ్రీ నిధులడిగితే వైద్యశాలలకు నోటిసులిస్తూ బెదిరిస్తున్నారని వివరించారు. రూ.13 వేల కోట్ల విలువైన 11 పెద్ద ప్రాజెక్టులను చెరువుల్లో కడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రెస్‌మీట్ పెట్టి మరీ చెప్పారని, ఏడాది గడిచినా వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ‘భట్టి ప్రెస్‌మీట్, సీఎం సెటిల్మెంట్’ అన్నవిధంగా హైడ్రా కొనసాగుతున్నదని విమర్శించారు. ఉద్యోగ సంఘాలపై ఏసీబీ దాడులు చేయిస్తున్న, దేశంలో అత్యధిక డీఏలు పెండింగ్‌లో ఉన్న రాష్ట్రం తెలంగాణేన ని తెలిపారు. పథకాలు ఆగిపోతాయని జూబ్లీహిల్స్ ఓటర్లను కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నారని మండిపడ్డారు. ‘ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకున్నది. ప్రజాస్వామ్యంలో బెదిరింపులకు తావులేదు. ఓటమి భయంతో ప్రస్టేషన్ పోయిండు. పథకాలు ఏమైనా ఇంట్లకెల్లి ఇస్తున్నవా? అయ్యా జాగీరా.. ప్రజల సొమ్ము.. ప్రజలకు ఇస్తున్నవ్’ అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. బ్లాక్‌మెయిలర్ రేవంత్‌రెడ్డికి ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ప్రశ్నించే బీఆర్ఎస్ను గెలిపించండి
కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో చేసిందేమీలేదని హరీశ్‌రావు విమర్శించారు. రెండేండ్లలో ఎందుకు మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని, ఎందుకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వలేదని నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పేదల కోసం పనిచేశామని, ప్రతపక్షంలో ఉండి పేదల కోసం కొట్లాడుతున్నామని హరీశ్‌రావు స్పష్టంచేశారు.
ముస్లింలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి
కాంగ్రెస్ అభ్యర్థి సోదరుడు వెంకట్యాదవ్కు మూడు ఓట్లు ఉన్నాయని ఈసీకి ఫి ర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్‌లో ఓటు చోరీ గురించి రాహుల్‌గాంధీ ఎందుకు మా ట్లాడరని నిలదీశారు. కాంగ్రెస్‌కు ఎంఐఎం బీ-టీమ్‌గా ఉన్నదని విమర్శించారు. కాంగ్రె స్ లేకుండా ముస్లింలు లేరంటూ కించపరిచేలా మాట్లాడిన రేవంత్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రేవంత్ అట్టర్ ఫెయిల్
రేవంత్ ప్రభుత్వం అన్నిరంగాలను విధ్వం సం చేస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. రేవంత్ జూబ్లీహిల్స్ ప్యాలెస్, లేదంటే కమాండ్ కం ట్రోల్ సెంటర్లో కూర్చుంటున్నారు తప్ప సెక్రటేరియట్‌కు రావడం లేదని విమర్శించారు. అక్కడ క్రైం మీద రివ్యూ చేయడంలేదుగానీ కమీషన్ల మీద రివ్యూ చేస్తున్నారని మండిపడ్డారు. మున్సిపల్, విద్యాశాఖ, హోంమంత్రిగా మొత్తం గా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రిగా అట్టర్ ఫెయిల్ అని విమర్శించారు. రేవంత్‌రెడ్డి వచ్చాక విత్తనాలు, బస్సు, మెట్రో, బీరు, వీస్కీ, రోడ్డుట్యాక్స్ ధరలు పెంచారని, ధరలు పెంచుడు, కమీషన్లు దంచుడే వారి విధానమని హరీశ్‌రావు దుయ్యబట్టారు. పర్సంటేజీల కోసం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్‌సిటీ అంటున్నారని మండిపడ్డారు. గ్యారెంటీలు అమలు కావాలంటే, కాంగ్రెస్ మెడలు వంచాలంటే కారు గుర్తుకు ఓటేయాలని పిలుపునిచ్చారు. అన్ని సర్వేలు బీఆర్ఎస్ గెలుస్తుందని స్పష్టం చేస్తున్నాయని, జూబ్లీహిల్స్‌లో నిశ్శబ్ద విప్లవం రాబోతున్నదని విశ్వాసం వ్యక్తంచేశారు.
కేంద్ర బలగాల పహారాలో నిర్వహించాలి
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను రాజ్యసభ ఎంపీలు సురేశ్‌రెడ్డి, దీవకొండ దామోదర్‌రావు కలిసి.. కేంద్ర బలగాలను దించాలని కోరినట్టు హరీశ్‌రావు వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. షేక్‌పేటలో బీఆర్ఎస్ నాయకుడు వహీద్ ఇంట్లోకి పోలీసులు చొరబడి ఇంట్లోని మహిళలపై మగ పోలీసులు ర్యూడ్ గా వ్యవహరించారని ఆరోపించారు. చట్టాన్ని అతిక్రమించి మర్రి జనార్ధన్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతల ఇండ్లలో సోదాలు చేస్తున్నారని పేర్కొన్నారు. డీజీపీ శివధర్‌రెడ్డికి సీఎం నియామక పత్రాన్ని అందజేశారని, అలాంటి వ్యక్తి లా అండ్ ఆర్డర్‌ను ఎలా కాపాడతారన్నారు.
కాళేశ్వరంపై ప్రచారం రాజకీయమే
కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం రాజకీయాల కే కాంగ్రెస్ వాడుతున్నదని హరీశ్‌రావు విమర్శించారు. తమ్మిడిహట్టి దగ్గర 150 మీటర్ల వద్ద కడతామని కాంగ్రెస్ అంటున్నదని, 150 మీటర్లకు కట్టినా… తీసుకోవాల్సిన నీళ్లు 80 టీఎంసీలేనని వివరించారు. కాళేశ్వరం ద్వారా వాడుతున్న నీళ్లు 280 టీఎంసీలని, మరి 80 టీఎంసీలు సరిపోతయా? అప్పుడైనా కాళేశ్వ రం కావాల్సిందేనని స్పష్టంచేశారు. తమ్మిడిహట్టి నుంచి సుందిళ్ల బరాజ్‌కు నీళ్లు తీసుకొస్తామని కాంగ్రెస్ చెప్తున్నదని గుర్తుచేశారు. ఆ బరాజ్లన్నీ కూలిపోతాయంటూ కాంగ్రెస్ ప్రచారం చేసిందని, మరి ఇప్పుడు సుందిళ్లకు నీళ్లు తీసుకొస్తామంటే అన్నారం, మేడిగడ్డ బాగున్నట్టే కదా? అని ప్రశ్నించారు. బరాజ్‌లపై కేవలం రాజకీయాలు చేస్తున్నట్టు తేలిపోతున్నదని పేర్కొన్నారు. సుందిళ్ల బరాజ్ పనిచేస్తే, అదే గోదావరి నదిపై కట్టిన అన్నారం, మేడిగడ్డ కూడా పనిచేస్తున్నట్టేనని స్పష్టంచేశారు. చిన్న మరమ్మతులతో మేడిగడ్డను వినియోగించుకోవచ్చునని చెప్పారు. కమీషన్ల కోసమే రూ.25 వేల కోట్లు ఖర్చు చేసి సుందిళ్ల నుంచి నీళ్లు తెస్తామంటున్నారని విమర్శించా రు. కేసీఆర్‌కు పేరు రావొద్దని కాంగ్రెస్ క్రూరంగా వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వాలు బా ధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
రేవంత్ హయాంలో గన్‌కల్చర్
బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల సీసీ కెమెరాలు పెడితే, ఆరు లక్ష లు కెమెరాలు హైదరాబాద్‌లోనే పెట్టామ ని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వాటి నిర్వహణను కూడా పట్టించుకోవడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. రేవంత్ పాలనలో శాంతిభద్రతల నిర్వహణ లేకుండాపోయిందని, నడిరోడ్డుపై మర్డర్లు జరుగుతున్నాయ ని, జగద్గిరిగుట్టలో మిట్టమధ్యాహ్నం, నడిరోడ్డుపై దారుణంగా కత్తితో దాడి చేసి యు వకుడిని హత్య చేశారని ఉదహరించారు. ‘రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని రంగాల్లో తిరోగమనం.. ఒక క్రైంలో మాత్రం పురోగమనం.. ఏ రంగమూ నమోదుచేయలేని వృద్ధి పోలీసు శాఖ నమోదుచేసింది. కేసీఆర్ అగ్రికల్చర్‌ను పెంచితే, రేవంత్ గన్‌కల్చర్‌ను పెంచిండు. 2025 జనవరి నుంచి సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నమోదైన క్రైం రేటు చూస్తే రేవంత్ ఘనత ఏపాటిదో అర్థమవుతుంది. మొత్తం 189 మర్డర్లు జరిగి తే, అందులో 88 నడిరోడ్డుపైనే జరిగాయి. 1,700 కిడ్నాపులు, 123 రేప్ కేసులు. 1051 దోపిడీలు. 6,411 ఇండ్లలో దొంగతనాలు నమోదయ్యాయి. మహిళలపై నే రాల శాతం 12.3% పెరిగింది. నిరుటితో పోల్చితే లైంగికదాడులు 28%, కిడ్నాప్‌లు 26% పెరిగాయి. సైబరాబాద్‌లో 41%, హైదరాబాద్‌లో 60% క్రైమ్ రేటు పెరిగిం ది. తెలంగాణలో 22% క్రైం రేటు పెరిగిందని ఎన్సీఆర్బీ రిపోర్టే స్పష్టంచేసింది’ అని వివరించారు. ముంబై పోలీసులు, చర్లపల్లిలో వేల కోట్ల వి లువైన డ్రగ్స్ పట్టుకున్నారంటే అంతకంటే అవమానం ఉంటుందా? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్, బీజేపీ బంధం
కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవడానికి చేసిన అభివృద్ధి ఏమీలేక నీచ రాజకీయాలు చేస్తున్నదని హరీశ్‌రావు విమర్శించారు. కాళేశ్వరంపై రెండేండ్లుగా ఎన్డీఎస్ఏ, విజిలెన్స్, ఘోష్ కమిటీ విచారణ, ఏసీబీ అంటూ వేధించారని, ఒక్క తప్పు అయినా దొరికిందా? అని ప్రశ్నించారు. ఇప్పుడు సీబీఐ విచారణ అంటూ నయా నాటకం మొదలుపెట్టారని విమర్శించారు. ఐదేండ్ల క్రితం రేవంత్‌రెడ్డిపై ఈడీ కేసు నమోదైనా ఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయడంలేదని నిలదీశారు. బీజేపీతో సంబంధం ఉన్నది కాబట్టే రేవంత్‌రెడ్డిని ఈడీ అరెస్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి, కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించడం కాకుండా ఆధారాలుంటే బయటపెట్టాలని, ఎవరూ ఆపడంలేదు కదా? అని పేర్కొన్నారు.
రేవంత్‌రెడ్డి పాలనలో అన్ని రంగా ల్లో తిరోగమనం.. ఒక క్రైంలో మాత్రం పురోగమనం. కేసీఆర్ అగ్రికల్చర్ పెంచితే, రేవంత్ గన్‌కల్చర్ పెంచిండు.
-హరీశ్‌రావు
2025 జనవరి – సెప్టెంబర్ వరకు రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు
నిరుటితో పోలిస్తే ఎంత పెరిగింది?
– గణాంకాలు వెల్లడించిన హరీశ్