యాదాద్రి భువనగిరి : యాదగిరిగుట్ట(Yadagirigutta )లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. స్వామి వారి దర్శనానికి క్యూలైన్లో భక్తులు బారులు తీరారు. అలాగే లక్ష్మీ నరసింహస్వామి (Lakshmi Narasimha Swamy) వారిని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish rao) దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి స్వామి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.