హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) నివాళులర్పించారు. భారత రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త గమ్యాలకు తీసుకెళ్లిన మహోన్నత నాయకుడని చెప్పారు. ఆయన చూపిన దారే నేటి అభివృద్ధి పునాది అని వెల్లడించారు. పీవీ నరసింహారావు సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదామని కోరుకుంటున్నాని చెప్పారు.
‘తెలంగాణ ముద్దుబిడ్డ, భారత రత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు గారి వర్థంతి సందర్భంగా నివాళి. భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త గమ్యాలకు తీసుకెళ్లిన మహోన్నత నాయకుడు. ఆయన చూపిన దారే నేటి అభివృద్ధి పునాది. పీవీ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో ముందుకు సాగుదామని కోరుకుంటున్నాను.’ అంటూ ట్వీట్ చేశారు.
తెలంగాణ ముద్దుబిడ్డ, భారత రత్న, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు పీవీ నరసింహారావు గారి వర్థంతి సందర్భంగా నివాళి.
భారతదేశ రాజకీయ, ఆర్థిక రంగాలను కొత్త గమ్యాలకు తీసుకెళ్లిన మహోన్నత నాయకుడు. ఆయన చూపిన దారే నేటి అభివృద్ధి పునాది.
పీవీ గారి సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన… pic.twitter.com/wqKP1sXK8k
— Harish Rao Thanneeru (@BRSHarish) December 23, 2024