గోదావరిఖని, జూన్ 4: సింగరేణిలో అవినీతిపై ఈనెల 7న మాజీ మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని శ్రీమయి ఫంక్షన్ హాల్లో అవగాహన సదస్సు ను నిర్వహిస్తున్నామని టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షుడు కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువా రం టీబీజీకేఎస్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సదస్సుకు కార్మికలోకం పెద్దసంఖ్య లో తరలివచ్చి విజయవంతం చేయాలని పి లుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సింగరేణిలో అనేక అవినీతి, కుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
సింగరేణికి ప్రభుత్వం నుంచి వేలాది కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నాయని తెలిపారు. సింగరేణిని సర్వనాశనం చేసి, ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం చూస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి సంస్థ అభివృద్ధితోపాటు, కార్మికుల సంక్షేమానికి విశేష కృషి జరిగిందని గుర్తుచేశారు. అనేక ఏండ్లుగా పరిష్కారం కాని సమస్యలను నాటి సీఎం కేసీఆర్ పరిష్కరించారని పేర్కొన్నారు. అనంతరం సదస్సు వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి, చెల్పూరి సతీశ్ ఉన్నారు.