ఎల్లారెడ్డి, ఆగస్టు 5: రెండు రోజుల క్రితం లింగంపేట పెద్దవాగులో గల్లంతైన రాంపూర్ కొన తండాకు చెందిన దేవసోతు శ్రీహరి(53) మృతదేహం బుధవారం లభ్యమైంది. సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురియడంతో.. శ్రీహరి పెద్ద వాగు సమీపంలో ఉన్న ఎడ్ల బండి, పశువులను తొలుకు వస్తానని చెప్పి వెళ్లాడు.
వాగులో గల్లంతైనట్లు కుటుంబీకులు భావించారు. బుధవారం తండాకు అర కిలోమీటర్ దూరంలో ఉన్న చెక్ డ్యాం వద్ద ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ సిబ్బంది, గ్రామస్తులు కొన్ని గంటలపాటు గాలించగా శ్రీహరి మృతదేహం లభించింది. సాయంత్రం శ్రీహరి కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ఘటనకు సంబంధించి లింగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు.