Manne Krishnak | కేటీఆర్ హోటల్ అని కొందరు కాంగ్రెస్ నేతలు, వాళ్ల పెయిడ్ బ్యాచ్ పంపించి వీడియోలు చేస్తున్నరని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తిప్పి కొడితే అది కిరాయి బంగ్లా.. అందులో హోటల్ నడిపిస్తున్నారు. వీళ్లేదైతే హోటల్ అంటున్నరో 2009లోనే కేటీఆర్ హోటల్ గురించి అఫిడవిట్లో పెట్టారు..కానీ దాన్ని ఒక పెద్ద భూతద్దం పెట్టి హరీశ్ రావు ఎన్నికల అఫిడవిట్‌ను, కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్‌ను చూపెట్టి ఇగో చూడండి.. రాష్ట్రమంతా కూడా ఇంత ఆస్తులు.. ఏమున్నది కేసీఆర్ పొలం లేదా కేటీఆర్ ఒక కిరాయి బంగ్లాలో నడిపిస్తున్న హోటల్.. లేదా హరీశ్ రావుకున్న పొలం, ఏమైనా భూములు గంతేనన్నారు.
రేవంత్ రెడ్డి మూడేళ్లలో ఒక్క ప్రభుత్వ హాస్పిటల్, ఒక ప్రభుత్వ పాఠశాల కూడా నిర్మించలేదన్నారు మన్నె క్రిశాంక్.. పోనీ విద్యాశాఖ మంత్రిగా నువ్వేమైనా చేసినవా అంటే ప్రభుత్వ పాఠశాలలను, గురుకుల పాఠశాలలను రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేరు.. కొంపల్లిలో రేవంత్ రెడ్డి అమ్మాయికి చెందిన నిర్మాణం అవుతున్న స్కూల్ బిల్డింగ్ ఇది. దానికి సంబంధించిన ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి.. సర్వే నంబర్ 87. అనుముల నిమిషా రెడ్డి రిప్రజెంటెడ్ బై సూరం అనిల్ కుమార్ రెడ్డి అని పెట్టారు. ఎవరీ సూరం అనిల్ కుమార్ రెడ్డి.. రేవంత్ రెడ్డి మెస్సీతో ఫుట్ బాల్ మ్యాచ్ ఆడేందుకు వచ్చినప్పుడు మనవడిని కూడా ఎత్తుకొచ్చిండు కదా.. ఆయననే ఇందులో మొదటి ఫొటో సూరం అనిల్ కుమార్ రెడ్డి, రిప్రజంటేటివ్ ఆఫ్ నిమిషా రెడ్డి అని ఉన్నదన్నారు.
ఇంతకీ రేవంత్ రెడ్డి కూతురుతో ఇన్ని వ్యాపారాలు చేస్తున్న ఎంజెల్ ఇన్వెస్టర్ దుంప శిరీష ఎవరు అని ప్రశ్నించారు. దుంప శిరీష మాక్సిపియన్ ఫార్మాలో రేవంత్ రెడ్డి అల్లుడితో ఉంటరు. మెడికోవర్ ఆస్పత్రిలో ఉంటరు.. నిమిషారెడ్డితో ఇందులో కూడా పార్ట్నర్గా ఉంటరని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి మూడేళ్లలో ఒక్క ప్రభుత్వ హాస్పిటల్, ఒక ప్రభుత్వ పాఠశాల కూడా నిర్మించలేదు
కానీ కొంపల్లిలో పెద్ద ఎత్తున నైమిష రెడ్డి ఇంటర్నేషనల్ స్కూల్ భవనం నిర్మాణం జరుగుతుంది
రేవంత్ రెడ్డి కూతురుతో ఇన్ని వ్యాపారాలు చేస్తున్న దుంప శిరీష ఎవరు?
– మన్నె క్రిశాంక్ pic.twitter.com/nEXFxZ5ANh
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2026
2009లోనే కేటీఆర్ హోటల్ గురించి అఫిడవిట్లో పెట్టారు
ఆ హోటల్ కూడా కిరాయి బంగ్లాలో నడుస్తుంది.. దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి రేవంత్ రెడ్డి చూపిస్తున్నాడు
– మన్నె క్రిశాంక్ https://t.co/1ydllxr4bq pic.twitter.com/HKa0alO6BS
— Telugu Scribe (@TeluguScribe) October 3, 2026