Rahul Gandhi: ఆర్థిక సంక్షోభ అంచుల్లో భారత్.. తీవ్ర స్థాయిలో నిరుద్యోగం: రాహుల్ గాంధీ
Rahul Gandhi: అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో విద్యార్థులను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. భారత్ ఆర్థిక సంక్షోభం అంచుల్లో ఉందన్నారు. దేశంలో నిరుద్యోగం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీ: భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోబోతున్నట్లు రాహుల్ గాంధీ(Rahul Gandhi) తెలిపారు. దేశంలో నిరుద్యోగం కూడా అధికంగా ఉన్నట్లు చెప్పారు. ఉత్పత్తి వ్యవస్థ దెబ్బతిన్నదని, విద్యా వ్యవస్థలో అనేక సమస్యలు ఉన్నాయని విపక్ష నేత రాహుల్ అన్నారు. ప్రస్తుతం ఉన్న ఆర్థిక దిశలోనే కొనసాగితే.. దేశంలో తీవ్ర సమస్యలు ఉత్పన్నం అవుతాయని అన్నారు. అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారతీయ ఆర్థిక మోడల్ గత దశాబ్ధం నుంచి ఫలితాలు ఇవ్వడం ఆపేసిందన్నారు. మేకిన్ ఇండియా, స్టార్టప్ ఇండియా లాంటి ప్రభుత్వ స్కీమ్‌లను రాహుల్ తప్పుట్టారు. దెబ్బతిన్న ఆర్థిక వెన్నుముకను ఆ పథకాలు కాపాడలేకపోయాయన్నారు.
ఆర్థిక సంక్షోభం అంచుల్లో భారత్ ఉందని, అదే వాస్తవం అని, మీడియా కానీ, ఎవరైనా కానీ ఆ అంశాన్ని పక్కన పెట్టారని, కానీ ఇండియాలో నిరుద్యోగం భీకర స్థాయిలో ఉందన్నారు. భారతీయ విద్యా వ్యవస్థతోనూ సమ్యలు ఉన్నట్లు చెప్పారు. మంగళవారం న్యూయార్క్ చేరుకున్న రాహుల్ గాంధీ.. కొలంబియా వర్సిటీలోని వందల సంఖ్యలో ఉన్న విద్యార్థులను, ఫ్యాకల్టీ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. చిన్న, మధ్యతరహా వ్యాపారులే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అని, ఉద్యోగ కల్పనలో, వ్యవసాయానికి ఆధారమని, ఇండియాలో ఇదే మూలం అని, కానీ ఆర్థిక వ్యవస్థ వెన్నువిరిచారని రాహుల్ అన్నారు.
దేశంలో ప్రైవేటు పెట్టుబడులు తగ్గిపోయాయని ఆరోపించారు. కేవలం అదానీ, అంబానీ పెట్టుబడులు ఉన్నాయన్నారు. ఉత్పత్తి వ్యవస్థ లేకుండా సక్సెస్ కాలేమన్నారు. భారత్‌లో చోటుచేసుకున్న విద్యార్థుల నిరసన ప్రదర్శన గురించి చెబుతూ ఆ నిరసనలు అప్పుడే పుట్టినవికావన్నారు. పదేళ్లుగా జరుగుతున్న రాజకీయ, ఆర్థిక అణిచివేత వల్ల విద్యార్థులు ఉద్యమించినట్లు చెప్పారు. సంపద, అధికారం కేంద్రీకృతం కావడం వల్ల ఆదివాసీలు, దళితులు, రైతులు తీవ్ర ప్రభావానికి లోనైనట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరుగుతున్నాయని, దీనిలో భాగంగానే సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తప్పించాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల వ్యవస్థను సుస్థిరం చేయాలని, లేదంటే ఏమీ జరగబోదన్నారు. అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. పెరిగిన ఇంధన ధరల ప్రభావం వల్లే రిపబ్లికన్ పార్టీ ఓడిందన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: ఆర్థిక సంక్షోభ అంచుల్లో భారత్.. తీవ్ర స్థాయిలో నిరుద్యోగం: రాహుల్ గాంధీ
Munipalli | స్నానం చేస్తేనే పాఠశాలకు రావాలి..! నేను ఇంతే, నా మాటే శాసనం
Dulquer Salmaan | విమర్శలను మోటివేషన్‌గా మార్చుకుంటున్నా: దుల్కర్ సల్మాన్!
ఉసిరికాయలపల్లి ఏహెచ్ఎస్ పాఠశాలలో డీడీ ఆకస్మిక తనిఖీ
Korukanti Chander | బూడిద లారీల పేరిట కలెక్టర్ దోపిడీ..! : మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

