బీజేపీ నిర్లక్ష్యం.. కాంగ్రెస్ వైఫల్యం
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ల క్ష్యం, కాంగ్రెస్ వైఫల్యానికి కేంద్ర బడ్జెట్ మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్యాయం జరగకపోవడం దారుణమని మండిపడ్డారు.
- కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం
- ఒక్క ప్రాజెక్టూ లేదు.. ఆర్థిక సాయమూ లేదు
- మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆగ్రహం
హైదరాబాద్, ఫిబ్రవరి1 (నమస్తే తెలంగాణ): తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ నిర్ల క్ష్యం, కాంగ్రెస్ వైఫల్యానికి కేంద్ర బడ్జెట్ మరో నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. దేశ ఆర్థిక వృద్ధికి కీలకంగా దోహదపడుతున్న తెలంగాణకు ఈ బడ్జెట్లోనూ న్యాయం జరగకపోవడం దారుణమని మండిపడ్డారు. ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఏండ్లు గడుస్తున్నా, బడ్జెట్లు మారుతున్నా నిధుల కేటాయింపులో తెలంగాణపై కేంద్రం చూపుతు న్న వివక్షలో ఎలాంటి మార్పు లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. 12 ఏండ్లు గడిచి నా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో కేంద్రం దారుణంగా విఫలమైందని మండిపడ్డారు.
‘రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ మెట్రో విస్తరణ, రైల్వే ప్రాజెక్టులు, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులు లేకపోవడం ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. తెలంగాణకు ఐఐఎం, నవోదయ, కేంద్రీ య విద్యాలయాల ఊసు లేదు. ఒక ప్రాజెక్టుకూ ఆర్థిక సాయం లేదు. తెలంగాణపై కేంద్రం ప్రదర్శిస్తున్న స్పష్టమైన ఆర్థిక అన్యాయం ఇది. తెలంగాణ నుంచి బీజేపీకి 8 మంది, కాంగ్రెస్‌కు 8 మంది ఎంపీ లు ఉన్నా రాష్ట్రానికి ఒక కొత్త ప్రాజెక్టు కూడా రాలేదు.
పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించడంలో కాంగ్రెస్, బీజేపీ ఘోరంగా విఫలమయ్యాయి. తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా, బడ్జెట్లో నిధులు రాబట్టలేక పోవడం సిగ్గుచేటు. వారి అసమర్థతకు నిదర్శనం. సీఎం రేవంత్ 60కిపైగా సార్లు ఢిల్లీ వెళ్లినా, వాటి ఫలితం శూన్యం. ఢిల్లీ పర్యటనలు రాజకీయ ప్రదర్శనలకే పరిమితమయ్యాయి తప్ప, తెలంగాణకు ఎలాంటి లాభం లేదు’ అని హరీశ్‌రావు దుయ్యబట్టారు.
భవిష్యత్‌పై స్పష్టత లేని బడ్జెట్
సీఎం రేవంత్ తన రాజకీయ ప్రయోజ నం కోసం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రం వద్ద తాకట్టు పెట్టడం వల్లే బడ్జెట్ కేటాయింపుల్లో తెలంగాణకు కనీస ప్రాధాన్యం లే కుండా పోయిందయని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీ య పార్టీలతో తెలంగాణ కు జరిగేది నష్టమే తప్ప లాభం కాదని మరోసారి స్పష్టమైందని వివరించా రు. వ్యవసాయం, ఆరో గ్యం, విద్య రంగాలకు బడ్జెట్లో తగిన ప్రాధా న్యం లేదని, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఎస్టీటీ పెంపు మారెట్ విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలని వివరించారు.
రాష్ట్రాలకు రావాల్సిన పన్ను వాటాను క్రమంగా తగ్గిస్తూ ఆర్థిక సమాఖ్య (ఫిస్కల్ ఫెడరిలిజం) స్ఫూర్తిని తీవ్రంగా దెబ్బతీశారని, కేంద్రం మాటల్లో సహకార సమాఖ్య (కోఆపరేటివ్ ఫెడరిలిజం) అంటూనే ఆచరణ లో రాష్ట్రాలపై వివక్ష చూపడం ప్రజాస్వా మ్య విరుద్ధమని విమర్శించారు. ‘మధ్యతరగతి ప్రజలకు పన్ను ఊరట లేదు. ద్రవ్యోల్బణ భారం పట్టించుకోలేదు. ఉద్యోగ కల్పన వాస్తవ రూపం దాల్చడం లేదు. దేశం ఎదురొంటున్న అతిపెద్ద సవాళ్లయిన నిరుద్యోగం, తయారీ రంగం పతనం, రైతుల సంక్షోభం గురించి బడ్జెట్లో కనీస ప్రస్తావన లేకుండా పోయింది’ అని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
కేసీఆర్ మాడల్‌ను చాటి చెప్పిన 16 వ ఆర్థిక సంఘం
అనేక సవాళ్ల నడుమ కూడా తెలంగాణ అభివృద్ధి సాధించిందంటే, అది కేసీఆర్ పదేండ్ల ప్రభుత్వ సమర్థవంతమైన ఆర్థిక పాలనా ఫలితమని 16వ ఆర్థిక సంఘం స్పష్టంచేసిందని హరీశ్‌రావు వివరించారు. తెలంగాణ సొంత పన్ను రాబడి 2023-24 నాటికి దేశంలోనే 80% చేరిందని, అది అత్యధికమని వివరించారు. కేంద్ర నిధులపై అత్యల్పంగా ఆధారపడే రాష్ట్రం గా తెలంగాణ నిలిచిందని కొనియాడారు.
2023-24 నాటికి మూలధన వ్యయం విషయంలో తెలంగాణ దేశంలో టాప్ 4 రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని, వ్యవసా య రంగంలో రైతుబంధు వంటి చారిత్రక పథకాలు తెలంగాణలోనే అమలయ్యాయని, 2023-24 నాటికే రూ.19,681 కోట్ల తో దేశంలోనే అత్యధిక వ్యవసాయ సబ్సిడీ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ అని రుజువైందని వివరించారు. కేసీఆర్ ప్రారంభించిన మిషన్ కాకతీయ పథకమే అమృత్ సరోవర్‌గా దేశానికి రోల్‌మాడల్‌గా నిలిచిందని, బడ్జెట్లో చెప్పిన ‘500 రిజర్వాయర్లు, అమృత సరోవర్ల అభివృద్ధి’ ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నదని, తెలంగాణ ఆచరిస్తే.. దేశం అనుసరిస్తున్నదన్న విషయం మరోసారి రుజువైందని పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

