మాటల్లో గొప్పలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు
మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఇదేనా రేవంత్‌రెడ్డి ప్రజాపాలన? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. ప్రభుత్వం తమ వేతనాల్లో కోతలు విధిస్తున్నదని, న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
- బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ఫైర్
- అడ్డగోలుగా ఆర్టీసీ టికెట్ల ధరల పెంపుపై ఆగ్రహం
- మాజీ మంత్రిని కలిసిన మున్సిపల్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు
హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): మాటల్లో కోతలు.. ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఇదేనా రేవంత్‌రెడ్డి ప్రజాపాలన? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు ప్రశ్నించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంఘం నాయకులు శనివారం హరీశ్‌రావును ఆయన నివాసంలో కలిశారు. ప్రభుత్వం తమ వేతనాల్లో కోతలు విధిస్తున్నదని, న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 20-25 ఏండ్లుగా సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల్లో కోత పెట్టడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1181 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల పాలిట శాపంలా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 31వేల ఉద్యోగుల కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతున్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో వేతనాలు పెంచితే కాంగ్రెస్ పాలనలో కోతలు పెట్టడం శోచనీయమని మండిపడ్డారు. వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
మాటల్లో ఉచితాలు.. చేతల్లో చార్జీల మోత
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం.. చేతల్లో మాత్రం చార్జీల మోత మోగిస్తున్నదని హరీశ్‌రావు ధ్వజమెత్తారు. అడ్డగోలుగా ఆర్టీసీ టికెట్ల ధరల పెంపుపై శనివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రయాణికులు పంపిన బస్ టికెట్‌ను ఎక్స్‌లో షేర్ చేస్తూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. హైదరాబాద్-హనుమకొండ ఏసీ బస్సు చార్జీ ఆగస్టు 20న రూ.410 ఉంటే.. సెప్టెంబర్ 11న ఏకంగా రూ.570కి పెంచారు.. అంటే కేవలం 20 రోజుల వ్యవధిలో ఒక్కో ప్రయాణికుడిపై రూ.160 అదనపు భారం మోపిందని ఆరోపించారు. ఇది ప్రజాపాలన కాదు.. దోపిడీ పాలన అని విరుచుకుపడ్డారు. పెంచిన ఆర్టీసీ చార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
RRB Jobs | రైల్వేలో 3548 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ ఖాళీలు.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఆర్ఆర్బీ
Alias Rukmini | ఆసక్తి రేపుతున్న నితిన్, నానిల ‘అలియాస్ రుక్మిణి’.. డిసెంబర్ 4న థియేటర్లలో సందడి!
Gaurav Yadav: పంజాబ్ డీజీపీగా గౌరవ్ యాదవ్ నియామకం
Anchor Manjusha | మంజూష అందాల విందు.. చీరకట్టులో మెరిసిపోతున్న యాంకర్!
Ranabaali | యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్న విజయ్ దేవరకొండ ‘రణబాలి’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

