హైదరాబాద్, సెప్టెంబర్12(నమస్తే తెలంగాణ): చారిత్రక జామియా నిజామియాకు చెందిన రాయదుర్గ్ వక్ఫ్ భూముల పరిరక్షణలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఉదాసీన వైఖరిని నిరసిస్తూ ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్ ధర్నాచౌక్ వద్ద భారీ నిరసన చేపట్టనున్నట్టు మైనారిటీ జేఏసీ ప్రకటించింది.
హైదరాబాద్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జేఏసీ కన్వీనర్, రాష్ట్ర మైనారిటీ హకుల పోరాట సమితి అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తుంగలో తొకి వక్ఫ్ భూములను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేలా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. నిరసనకు ముస్లింలు, మైనారిటీ సంఘాలు, యువత భారీగా తరలిరావాలని కోరారు.