బెంగళూరు, సెప్టెంబర్ 12 : బెంగళూరులో అదృశ్యమైన 18 ఏండ్ల కళాశాల విద్యార్థిని ఆచూకీ కనుగొనేందుకు ‘ఆధార్ ఓటీపీ’ దోహదపడింది. సదరు విద్యార్థి అదృశ్యమైన ఏడు నెలల తర్వాత ఆధార్ అనుసంధానిత డిజిటల్ జాడతో ఆచూకీ పట్టుకోగలిగారు. విద్యార్థిని తనిష్క తన మైనర్ స్నేహితురాలితో కలిసి విద్యారణ్యపురలోని తన ఇంటి నుండి బయలుదేరింది. ఇద్దరూ కళాశాలకు వెళ్తున్నామని తమ కుటుంబ సభ్యులకు చెప్పి తిరిగి రాలేదు. వారు తమ మొబైల్ ఫోన్లు, ఏటీఎం కార్డులను ఇంట్లోనే వదిలి, కేవలం ఆధార్ కార్డులు, కళాశాల బ్యాగులను మాత్రమే వెంట తెచ్చుకున్నారు. అయితే వీరి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు దేశవ్యాప్తంగా 100కుపైగా ప్రాంతాల్లో గాలించారు.
ఇంట్లో నుంచి వెళ్లిపోయిన కొద్ది నెలలకే ఆమె తనకు పరిచయమైన ఓ వ్యక్తిని వివాహం చేసుకున్నది. ప్రభుత్వ ఆరోగ్య పథకంలో పేరు నమోదు చేసుకోవడానికి తన ఆధార్ వివరాలను దరఖాస్తులో పేర్కొన్నది. అందులో ఆమె తన భర్త మొబైల్ నంబర్‌ను ఇచ్చింది. ఆమె ఆధార్ నంబర్‌పై ఓటీపీ వెళ్లిన మొబైల్ నంబర్‌ను పోలీసులు ట్రేస్ చేసి కనుగొన్నారు. తర్వాత ఆమె ఆచూకీ దొరికింది. హైకోర్టులో ఆమెను హాజరుపరిచి, తల్లిదండ్రులకు అప్పగించారు. వివాహం చేసుకున్న ఆమె గర్భవతిగా ఉందని పోలీసులు చెప్పారు. వారి ఆచూకీ కనుగొనేందుకు పోలీసులు 100కుపైగా ప్రాంతాల్లో గాలించారు.