హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలన్న డిమాండ్‌తో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) శనివారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. అసెంబ్లీ గేట్ వద్దకు చేరిన కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు.
పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు. రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు మాట్లాడుతూ.. పేద విద్యార్థులు చదువుకోవడం సీఎం రేవంత్‌రెడ్డికి ఇష్టంలేదని ఫైర్ అయ్యారు. జీవో 97ను ఉపసంహరించుకోవాలని కోరారు.