Harish Rao | కాంగ్రెస్ నాయకుల అరాచకాలపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. వ్యాపారులను తుపాకులతో బెదిరించి, కమీషన్లు వసూలు చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ కుమార్తె చెప్పిందని గుర్తుచేశారు. సీఎం సన్నిహితుడు రోహిన్ రెడ్డి బెదిరించాడని మంత్రి కుమార్తె చెప్పిందని తెలిపారు.
అలంపూర్‌లో రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ఏఐసీసీ నేత ఎమ్మెల్యే సంపత్ కుమార్ రూ.8 కోట్లు కావాలని కాంట్రాక్టర్లను బెదిరించాడని తెలిపారు. ఈ ఘటనపై స్వయంగా కాంట్రాక్టరే వచ్చి ఫిర్యాదు చేశాడని.. అయినా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. దీనిపై సిట్ ఏది అని నిలదీశారు. జర్నలిస్టులను వేధించడానికి సిట్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులను వేధించడానికి సిట్లు, కమీషన్లు ఏర్పాటు చేస్తున్నారని.. మరి సంపత్ మీద సిట్ ఉండదా అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఖాకీ బుక్ అందరికీ సమానమే అని నీతులు చెప్పారు కదా.. ఇప్పుడు ఏమైందని డీజీపీ శివధర్ రెడ్డిని ప్రశ్నించారు. మీ ఖాకీ బుక్‌ను కాకి ఎత్తుకుపోయిందా అని ఎద్దేవా చేశారు. జర్నలిస్టులను బెదిరించిన సీపీ సజ్జనార్ రూల్ బుక్ ఏమైందని ప్రశ్నించారు.
మీ ఖాకీ బుక్ కాకి ఎత్తుకపోయిందా?
అలంపూర్‌లో రేవంత్ రెడ్డి సన్నిహితుడు, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ రూ.8 కోట్లు కావాలని కాంట్రాక్టర్‌ను బెదిరించాడు
కాంట్రాక్టరే స్వయంగా సంపత్ బెదిరించాడు అని ఫిర్యాదు చేశాడు.. దీనిపై సిట్ ఏది?
జర్నలిస్టులను వేయించడానికి సిట్లు.. బీఆర్ఎస్… https://t.co/PzYgq4Egeg pic.twitter.com/SLws5PXRxp
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026
సీఎం రేవంత్ రెడ్డికి తెల్వకుండా సిట్ వచ్చిందని చెబుతున్నారని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డికి తెల్వకుండా సిట్ వస్తే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయినట్లే కదా అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి తెలియకుండా సిట్ ఎలా వస్తుందని నిలదీశారు. రాష్ట్ర అడ్మినిస్ట్రేటర్ అయిన సీఎం ఏం చేస్తున్నాడని అడిగారు.