ఎస్సీ, ఎస్టీలకు కాంగ్రెస్ దగా.. పోడు భూములకు పట్టాలిస్తామని రేవంత్‌రెడ్డి సర్కార్ మోసం
చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చెప్పిందొక్కటీ అమలుకాలేదని ధ్వజమెత్తారు. డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను వెంటనే అమలుచేయాలనే డిమాండ్‌తో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు.
- ఎస్సీ, ఎస్టీలకు కార్పొరేషన్ల పేరిట రూపాయి కూడా ఇవ్వలే
- కొడంగల్ లంబాడీ బిడ్డలే రేవంత్‌కు రాజకీయ సమాధి కడ్తరు
- చేవెళ్ల డిక్లరేషన్ అమలుచేయకుంటే ఖర్గే ఇంటి ముందు ధర్నా
- ఇందిరాపార్కు వద్ద మొదలైన పోరాటం ప్రతి తండాకూ చేరాలి
- ఇక నగారా మోగిద్దాం.. ఇది లంబాడీల ఆత్మగౌరవ పోరాటం
- ఎల్‌హెచ్‌పీఎస్ మహాధర్నాలో మాజీ మంత్రి హరీశ్‌రావు
కవాడిగూడ, మే 26 : చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీలను కాంగ్రెస్ దగా చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. చేవెళ్ల డిక్లరేషన్‌లో సోనియాగాంధీ, రాహుల్ గాంధీ చెప్పిందొక్కటీ అమలుకాలేదని ధ్వజమెత్తారు. డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన 12 హామీలను వెంటనే అమలుచేయాలనే డిమాండ్‌తో ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్‌నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చేవెళ్ల డిక్లరేషన్‌ను స్వయంగా ప్రకటించిన మల్లికార్జున ఖర్గే సీఎం రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పి వెంటనే అమలు చేయించాలని డిమాండ్ చేశారు. అదే మోసపూరిత వైఖరి కొనసాగిస్తే ఢిల్లీకి వెళ్లి ఖర్గే ఇంటిముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.
తండాలను జీపీలు మార్చిన ఘనత కేసీఆర్‌దే..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు లంబాడీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ‘మా తండాలో.. మా రాజ్యం’ నినాదంతో ఎన్నో పోరాటాలు జరిగినా, నాటి ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలు ఏనాడూ వారి బాధలు పట్టించుకోలేదని గుర్తుచేశారు. స్వరాష్ట్రం ఏర్పాటైన తర్వాత 3,146 తండాలను గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసి సర్పంచులుగా చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. పోడు భూములకు పట్టాలు ఇస్తామని మోసం చేసిన రేవంత్ పట్టాలు ఇవ్వలేదు గానీ 50వేల ఎకరాల ఎస్సీ, ఎస్టీ భూములను పరిశ్రమల పేరుతో బడా కంపెనీల కోసం లాక్కున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. భూములు లాక్కొన్నారని అడ్డు తిరిగిన చేతులకు బేడీలు వేసిన రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కొడంగల్‌లో గెలిపించిన లంబాడీ బిడ్డలే రేవంత్‌రెడ్డికి రాజకీయ సమాధి కడుతారంటూ హరీశ్‌రావు హెచ్చరించారు. తాము అధికారంలోకి వస్తే నాలుగు ఐటీడీఏలు పెడుతామని చెప్పి కొత్తగా ఒక్కటీ కూడా పెట్టలేదని, నిధులు లేక ఐటీడీఏలు నిర్వీర్యమైపోతున్నాయని మండిపడ్డారు. లంబాడీలకు కాంట్రాక్టుల్లో 12శాతం రిజర్వేషన్లు అని చెప్పి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వలేదని, రేవంత్‌రెడ్డి బామ్మర్ది సృజన్‌రెడ్డికి మాత్రం కాంట్రాక్టులు వచ్చాయని విమర్శించారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో లంబాడీలకు మంత్రి పదవి ఇవ్వకుండా చిన్నచూపు చూశారని ధ్వజమెత్తారు. పోడు భూములకు పట్టా ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సేవాలాల్ జయంతిని అధికారికంగా నిర్వహించామని చెప్పారు. బంజారాహిల్స్‌లో ఎకరం స్థలం ఇప్పించి అద్భుతంగా అత్మగౌరవ భవనాన్ని నిర్మించి ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. కానీ సేవాలాల్ మహారాజ్‌ను కాంగ్రెస్ పార్టీ అవమానపరిచిందని, సేవాలాల్ పేరిట కార్పొరేషన్ పెట్టి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, కుమ్రం భీం కార్పొరేషన్, ఏకలవ్య కార్పొరేషన్లకు ఒక్క రూపాయి ఇవ్వలేదని నిప్పులుచెరిగారు. ఎస్సీ కార్పొరేషన్‌కు బడ్జెట్లో 2,730 కోట్లు పెట్టి ఖర్చు చేసింది రూ.50కోట్లేనని విమర్శించారు. ఇందిరాపార్కు వద్ద జరుగుతున్నది ధర్నా కాదని లంబాడీల ఆత్మగౌరవ పోరాటం అని తెలిపారు. ఇక్కడ మొదలైన పోరాటంతో.. ఇక ప్రతి తండాలో నగారా మోగాలని.. తండా నుంచి ఢిల్లీకి వెళ్లి ఖర్గే ఇంటి ముందు ధర్నా చేద్దామని పిలుపునిచ్చారు. మహాధర్నాలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్‌యాదవ్, పెద్దిరెడ్డి సుదర్శన్‌రెడ్డి, మాజీ చైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, గజ్జల నాగేష్, సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవనాయక్, లంబాడీ హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి కోట్యానాయక్, చందర్ నాయక్, లంబాడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

