Harish Rao | రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు మండిపడ్డారు. దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత ఈ రేవంత్ సర్కార్‌దే అని విమర్శించారు. ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను ప్రభుత్వమే కొనకపోతే ఆ రైతన్నకు దిక్కెవరు అని ప్రశ్నించారు.
కల్లాల్లో రోజుల తరబడి పంటకు కాపలా కాస్తూ, దిగులుతో అన్నదాతలు పిట్టల్లా రాలిపోతుంటే కళ్లప్పగించి చూడటం తప్ప ఈ ప్రభుత్వం చేస్తున్నదేమిటి అని హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాల్సిన పాలకులే ముప్పుతిప్పలు పెట్టి మరణశాసనం రాస్తుంటే, దిక్కుతోచని అన్నదాత ‘నీ బాంచన్ పంట కొనండి’ అని కాళ్లపై పడటం తప్ప ఇంకేం చేయగలడు అని ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్న కన్నీటి శాపం పాలకులను వదలదు.. ఆ పాపం వారిని నీడలా వెంటాడుతూనే ఉంటుందని అన్నారు.
దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతులతోనే
అధికారుల కాళ్లు మొక్కిస్తున్న ఘనత
ఈ @revanth_anumula సర్కారుదే.ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంటను
ప్రభుత్వమే కొనకపోతే
ఆ రైతన్నకు దిక్కెవరు?కల్లాల్లో రోజుల తరబడి
పంటకు కాపలా కాస్తూ,
దిగులుతో అన్నదాతలు
పిట్టల్లా రాలిపోతుంటే
కళ్లప్పగించి… pic.twitter.com/k5v52koIOR— Harish Rao Thanneeru (@BRSHarish) May 8, 2026