Harish Rao | మింగడానికి మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది రేవంత్ రెడ్డి తీరు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఓయూ లా కాలేజీ మెస్‌లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోందని అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇస్తానని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి గారు.. కనీసం విద్యార్థులకు ఒక పూట మంచి భోజనం పెట్టలేకపోవడం సిగ్గుచేటు అని హరీశ్‌రావు విమర్శించారు. ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంలో గొడ్డుకారం, గురుకులాల్లో పురుగుల అన్నం, ఇప్పుడు యూనివర్సిటీల్లో పాడైపోయిన భోజనం.. ఇదేనా కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సాధించిన ఘనత అని నిలదీశారు. అడుగడుగునా యూనివర్సిటీ పర్యవేక్షణలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నదని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.
రేవంత్ రెడ్డి గారూ.. మీ చేతగానితనంతో విద్యార్థుల భవిష్యత్తును, ఆరోగ్యాన్ని ఆగం చేయకండి అని హరీశ్‌రావు హితవుపలికారు. ఇప్పటికైనా ప్రగల్భాలు మాని.. విద్యార్థులకు కడుపునిండా మంచి భోజనం పెట్టండని సూచించారు.
మింగడానికి మెతుకు లేదు కానీ.. మీసాలకు సంపంగి నూనె అన్నట్టుంది రేవంత్ రెడ్డి గారి తీరు.
ఓయూ లా కాలేజీ మెస్ లో పాడైపోయిన అన్నం పెడుతున్నారని విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేయడం కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ దుస్థితికి అద్దం పడుతోంది.
ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు… pic.twitter.com/6HM16NIlCZ
— Harish Rao Thanneeru (@BRSHarish) December 3, 2025