Harish Rao| బీఆర్ఎస్ జెండాలను కూల్చాలని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రంగా ధ్వజమెత్తారు. బిడ్డా రేవంత్! బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే.. నీ గద్దె కూలడం ఖాయం, జాగ్రత్త అని హెచ్చరించారు. బీఆర్ఎస్ గద్దెలను కూల్చితే దుమ్ము.. దుమ్ము అయిపోతావ్ అని వార్నింగ్ ఇచ్చారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. హౌలా మాటలు బంద్ పెట్టి.. ముందు ఆరు గ్యారంటీలు అమలు చేయాలని హితవు పలికారు.
కేబినెట్లో రైతుబంధు, ఎరువులు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరగలేదని హరీశ్‌రావు తెలిపారు. 20 లక్షల విద్యార్థుల జీవితాలతో రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నాడని మండిపడ్డారు. రాజీవ్ గాంధీ అప్పటి సీఎం అంజయ్యను అవమానించారని, ఆ అవమానంతోనే టీడీపీ ఆవిర్భవించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ భూస్థాపితం కావాలనే టీడీపీని నెలకొల్పారని తెలిపారు. కాంగ్రెస్ భూస్థాపితం చేయడానికి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఎన్టీఆర్ పోరాడాడని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు మనశ్శాంతి కలగాలంటే కాంగ్రెస్ భూస్థాపితం కావాలన్నారు. ఎన్టీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదనే స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి టీడీపీ గురించి మాట్లాడుతున్నాడంటే బీజేపీతో అక్రమ సంబంధం ఉన్నట్టే కదా అని ప్రశ్నించారు.
బిడ్డా రేవంత్ రెడ్డి మా పార్టీ గద్దెల జోలికొస్తే నీ గద్దె కూలుతది
ఈ హౌలా మాటలు బంజేయ్యి https://t.co/RQRTPAhuFp pic.twitter.com/UAUGYYAfN8
— Telugu Scribe (@TeluguScribe) January 19, 2026