Harish Rao | గత పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం విప్లవాత్మక మార్పులు సాధించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ముఖ్యంగా రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కేసీఆర్ అమలు చేసిన పలు కార్యక్రమాలు రాష్ట్ర వ్యవసాయ రంగాన్ని ప్రగతిపథంలోకి తీసుకెళ్లిందని తెలిపారు. ఎవరు అంగీకరించినా, అంగీకరించకపోయినా అది మాత్రం వాస్తవమని చెప్పారు. ఈ మేరకు రైతు సంక్షేమానికి కేసీఆర్ తీసుకున్న ప్రధాన చర్యలను ట్విట్టర్(ఎక్స్) వేదికగా హరీశ్‌రావు వివరించారు.
1. విప్లవాత్మకంగా రైతుబంధు పథకం
2. రెండు విడుతల్లో పంట రుణాల మాఫీ
3. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు
4. యూరియా, నాణ్యమైన విత్తనాల సరఫరా
5. వ్యవసాయ యాంత్రీకరణ
6. ప్రతి ఐదు వేల ఎకరాలకు వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం
7. 2,500కు పైగా రైతు వేదికల నిర్మాణం
8. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ
9. భూగర్భ జలాల పెరుగుదల
10. వ్యవసాయానికి 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్
11. ఆసరా పింఛను పథకం, ఆడబిడ్డల పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి/షాదీ ముబారక్ వంటి ఆర్థిక సాయం
12. ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ స్కాలర్షిప్
13. గ్రామీణ విద్యార్థుల కోసం వెయ్యికి పైగా గురుకులాలు
14. ఎస్సీ/ఎస్టీలకు లబ్ధి చేకూరేలా మహిళల డిగ్రీ కాలేజీలు
15. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన
కేసీఆర్ తీసుకొచ్చిన ఈ పథకాల వల్ల రైతు ఆత్మహత్యలు కనివినీ ఎరుగని స్థాయిలో తగ్గాయని హరీశ్‌రావు అన్నారు. కేసీఆర్ దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలబెట్టాయని చెప్పారు.