పరిగి వెళ్లకుండా అడ్డగింత.. శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి
ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగికి వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలిసేందుకు పరిగికి వెళ్తున్న బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావును పోలీసులు అప్పా జంక్షన్ వద్ద అడ్డుకుని శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావును స్టేషన్‌కు తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారిందని విమర్శించారు. పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకొని, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుందని అన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను పలకరించడానికి కూడా వెళ్లనివ్వడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, దయాకర్ రావులను అరెస్ట్ చేసి శంషాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించిన పోలీసులు https://t.co/piZLqqXGDS pic.twitter.com/M5XQUZ6z5O
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
రేవంత్ రెడ్డి పాలన రాక్షస పాలనగా మారింది
పరిగిలో అన్యాయానికి గురైన రైతులకు భరోసా ఇవ్వడానికి వెళ్తున్న మమ్మల్ని అడ్డుకొని, అన్యాయంగా అరెస్టులు చేస్తున్నారు
ఎక్కడికక్కడ దళిత, గిరిజన, బలహీనుల భూములు లాక్కుంటున్నారు
రాష్ట్రంలో పోలీసుల రాజ్యం నడుస్తుంది.. కష్టాల్లో ఉన్న రైతులను… https://t.co/hdCUm43JaD pic.twitter.com/VyKPExhTCE
— Telugu Scribe (@TeluguScribe) April 7, 2026
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

