కరీంనగర్లో బీజేపీ గూండాగిరి.. బీఆర్ఎస్ కార్యకర్తపై హత్యాయత్నం
కరీంనగర్లో బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్.. బీఆర్ఎస్ కార్యకర్త గుగులోతు శ్రీకాంత్‌పై ఆదివారం రాత్రి దాడికి పాల్పడటం కలకలం రేపింది. గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గం గుల కమలాకర్ పరామర్శించారు.
- బాధితుడికి దవాఖానలో చికిత్స
- మాజీ మంత్రి గంగుల పరామర్శ
కరీంనగర్ రాంనగర్, ఆగస్టు 10 : కరీంనగర్లో బీజేపీ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్.. బీఆర్ఎస్ కార్యకర్త గుగులోతు శ్రీకాంత్‌పై ఆదివారం రాత్రి దాడికి పాల్పడటం కలకలం రేపింది. గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న శ్రీకాంత్‌ను సోమవారం మాజీ మంత్రి, ఎమ్మెల్యే గం గుల కమలాకర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గంగుల మాట్లాడుతూ కరీంనగర్ ప్రజలు బీజేపీకి మేయర్‌గా అవకాశం ఇస్తే దాడుల సంస్కృతికి తెరలేపారని మండిపడ్డారు.
‘బీఆర్ఎస్లో ఎందుకు ఉంటున్నావ్’ అని శ్రీకాంత్‌ను బీజేపీ కా ర్పొరేటర్ సోమిడి వేణు బెదిరిస్తూ ఓ గుం డాలా 11 మందితో కలిసి వచ్చి విచక్షణారహితంగా దాడి చేశాడని తెలిపారు. బీజేపీ కార్పొరేటర్లు ఏం చేస్తున్నారో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కి తెలుస్తున్నదా? అని ప్ర శ్నించారు. ఈ ఘటనతో బండి సంజయ్‌కి సంబంధం లేకపోతే కార్పొరేటర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

