Harish Rao | పార్టీ మారనున్నట్లు జరుగుతున్న ప్రచారంపై హరీశ్‌రావు స్పందించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని.. అదే రోజున పార్టీ మార్పు వార్తలను ఖండించానన్నారు. పార్టీ నేతలు దాసోజు శ్రవణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసీఆర్ మా పార్టీ అధ్యక్షుడని తాను కొన్ని వందలసార్లు చెప్పానని.. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని తెలిపారు. పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటనన్నారు. మై లీడర్ ఇస్ కేసీఆర్.. వాట్ ఎవర్ కేసీఆర్ సే హరీష్ రావు విల్ ఫాలో అన్నారు. పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసా వహిస్తానన్నారు. కేటీఆర్‌కు నాయకత్వం అప్పజెపితే నేను స్వాగతిస్తానన్నారు.