హైదరాబాద్, జూన్ 21(నమస్తే తెలంగాణ) : తెలంగాణ మట్టిగడ్డను తీర్చిదిద్దిన ముద్దుబిడ్డ.. ఉద్యమానికి సైద్ధాంతిక పునాదులు వేసిన దార్శనికులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌సార్ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్‌రావు కొనియాడారు. సార్ వర్ధంతిని పురస్కరించుకొని నివాళులర్పించి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
చివరి శ్వాస వరకు తెలంగాణ సాధనకే ఆయన జీవితాన్ని అంకితమిచ్చారని గుర్తుచేశారు. ఆయన పోరాటం, అసమాన త్యాగం తరతరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. సార్ ఆశయాలకు అనుగుణంగా, ఎంతటి త్యాగాలకైనా సిద్ధపడి తెలంగాణ ప్రయోజనాలను కాపాడేందుకు కంకణబద్ధులమై ఉంటామని పునరుద్ఘాటించారు.