మహబూబాబాద్ : ప్రముఖ రాజకీయ నాయకుడు, ఉద్యమకారుడు నూకల నరేష్ రెడ్డికి(Nukala Naresh Reddy) మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు(Harish Rao) నివాళులు(Tribute) అర్పిం చారు. నరేష్ రెడ్డి దశదిన కార్యక్రమానికి హాజరైన హరీశ్ రావు నరేష్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. హరీశ్ రావు వెంట మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పెద్ది సుదర్శన్ రెడ్డి తదితరులు ఉన్నారు. కాగా, నరేష్ రెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా మారిన రేవంత్ రెడ్డి.. హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
VRAs protest | వారసత్వ ఉద్యోగాల కోసం ప్రజా భవన్ ఎదుట వీఆర్ఏల నిరసన