Harish Rao | అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా మారిన రేవంత్ రెడ్డి.. హరీశ్‌రావు తీవ్ర విమర్శలు
Harish Rao | పోలీస్ కానిస్టేబుల్స్‌కు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా మారి శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు.
Harish Rao | హైదరాబాద్ : పోలీస్ కానిస్టేబుల్స్‌కు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా మారి శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. టీఎస్ఎస్పీ కానిస్టేబుల్స్ 15 రోజులకు ఒకసారి బదులు.. నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మ్యానువల్ మార్చడం దుర్మార్గం అని మండిపడ్డారు. వారాల పాటు కుటుంబాలకు దూరం చేయడమేనా మీరు పోలీసులకు ఇచ్చిన దసరా, దీపావళి కానుక అని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు సూటిగా ప్రశ్నించారు.
హోం మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారూ.. టీఎస్ఎస్పీ కానిస్టేబుళ్లకు నెలకొకసారి లీవు విధానం అమలు చేయకుండా, ప్రస్తుత విధానాన్ని కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సివిల్, ఏఆర్ ఇతర విభాగాల పోలీసులకు 15 రోజుల టీఏ ఇచ్చేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడు రోజులకు దాన్ని కుదించింది. వారి పొట్ట కొట్టకుండా పాత విధానం ప్రకారమే 15 రోజుల టీఏ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పెండింగ్‌లో ఉన్న టీఏ, ఎస్ఎల్, జీపీఎఫ్‌లను వెంటనే విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల సరెండర్ లీవ్ ఎన్ క్యాష్మెంట్ పెండింగ్ డబ్బులు చెల్లించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలి. సివిల్ పోలీసులు వినియోగించే వాహనాల డీజిల్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి. కేసీఆర్ ప్రభుత్వం పోలీసు స్టేషన్ల నిర్వహణ కోసం మండల పోలీసు స్టేషన్‌కు రూ. 25 వేలు, పట్టణాల పరిధిలోని పీఎస్‌లకు రూ. 50 వేలు, హైదరాబాద్‌లో అయితే రూ. 75 వేలు ఇచ్చేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ నిర్వాణ కోసం నిధులు విడుదల చేయడం లేదు. దానివలన పోలీసులు, పోలీస్ స్టేషన్ వెళ్ళే ప్రజలపై భారం పడుతున్నది. ఈ నిధుల విడుదల కోసం సీఐలు ప్రభుత్వం వద్ద పైరవీలు చేసే దుస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కళ్లు తెరిచి పోలీస్ స్టేషన్ల నిర్వహణ కోసం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
పోలీస్ కానిస్టేబుల్ లకు జరుగుతున్న శ్రమదోపిడి గురించి నాడు అసెంబ్లీలో మాట్లాడిన రేవంత్ రెడ్డి, అధికారంలోకి వచ్చాక ఊసరవెల్లిలా శ్రమ దోపిడి విధానాన్ని అమలు చేస్తున్నారు.
టిఎస్ఎస్పీ కానిస్టేబుళ్ళు 15 రోజులకు ఒకసారి బదులు నెలకు ఒకసారి ఇంటికి వెళ్లేలా లీవ్ మాన్యువల్ మార్చడం… pic.twitter.com/wozVJqUDD3
— Harish Rao Thanneeru (@BRSHarish) October 15, 2024
ఇవి కూడా చదవండి..
VRAs protest | వారసత్వ ఉద్యోగాల కోసం ప్రజా భవన్ ఎదుట వీఆర్ఏల నిరసన
DSC | డీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్.. మధ్యాహ్నం 2 గంటల నుంచి డీఎస్సీ కౌన్సెలింగ్..
Amshula Satyanarayana | ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

