DSC | హైదరాబాద్ : డీఎస్సీ (DSC) ఉపాధ్యాయ పోస్టింగ్ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసినట్లు మంగళవారం ఉదయం విద్యాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. డీఎస్సీ కౌన్సెలింగ్‌ను మంగళవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్యలను అధికారులు పరిష్కరించారు. దీంతో కౌన్సెలింగ్‌కు వచ్చి వెనుదిరిగిన వారికి ఆయా జిల్లాల డీఈవోలు కౌన్సెలింగ్‌కు రావాలని మళ్లీ సమాచారం ఇచ్చారు.
డీఎస్సీ 2024 ద్వారా ఉపాధ్యాయ నియామక పత్రాలు అందుకున్న కొత్త టీచర్లకు మంగళవారం పోస్టింగ్‌లు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే. నూతన టీచర్లు ఆయా డీఈఓలు సూచించిన కార్యాలయాల్లో జరిగే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. అయితే సాంకేతిక కారణాలతో కౌన్సెలింగ్ వాయిదా పడింది. కాగా, కౌన్సెలింగ్ బుధవారం ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కానీ సమస్య పరిష్కారం కావడంతో మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి..
Suryapet | కొడుకు అన్నం పెట్టడం లేదంటూ కంటతడి పెట్టిన కన్నతల్లి.. ఆర్డీవోకు ఫిర్యాదు
Amshula Satyanarayana | ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ మృతి