సిద్దిపేట, మే 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రేవంత్ ఒక ఫెయిల్యూర్ సీఎం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. అప్పులు పుట్టడం లేదని మాట్లాడటం ఆయన వైఫల్యానికి నిదర్శనం అని పేర్కొన్నారు. రేవంత్‌కు పాలన చేతగాకపోతే దిగిపోవాలని డిమాండ్ చేశారు. అనాలోచిత వ్యాఖ్యలతో తెలంగాణ రాష్ట్రం పరువు తీస్తున్నాడని, ఎన్నికల ముందు ఇష్టమొచ్చిన వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చాక అన్నింటినీ గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తంచేశా రు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఎలా రోల్ మెడల్ అయింది.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు దివాలా తీసిందని ప్రశ్నించా రు. బుధవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట రూరల్ మండలం ఇర్కోడులో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. బాధిత రైతులను ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలో అకాల వర్షంతో తడిసిన ధా న్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు పడిగాపులు కాస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశా రు. అకాలవర్షంతో ధాన్యం తడిసి రైతు లు నష్టపోతున్నా పట్టింపేలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి అందాల పోటీలపై ఉన్న ధ్యాస రైతులపైన లేదని మం డిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా రైతులు దుఃఖభారంతో ఉంటే, సీఎం రేవంత్ హైదరాబాద్‌లో కూర్చొని రోజూ అందాల పోటీలపై సమీక్షలు చేస్తున్నారని విమర్శించా రు. పంట దెబ్బతిన్న రైతులను ప్రభు త్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజల బాగోగులు పట్టించుకోని సీఎం 43 సార్లు ఢిల్లీకి విమానంలో వెళ్లారని, మంత్రులు గాలి మోటర్లలో తిరుగుతున్నారని ధ్వజమెత్తారు.