Harish Rao | అరుంధతి సినిమాను ఎంతమంది చూసిర్రు. ఆ పశుపతిని బంధించిర్రా. గట్లనే ఫాంహౌస్లో బంధించిన పశుపతిని. మళ్లీ గొలుసులు తెంచేది లేదంటూ మంగళవారం హైదరాబాద్లో రైతులతో నిర్వహించిన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అరుంధతి సినిమాలో రాక్షసుడిని ఎట్లయితే బూతుబంగ్లాలో వేసి బంధించినమో ఈ రాక్షసుడిని కూడా ఫాంహౌస్లో గొలుసులువేసి మా రైతులు బంధించిర్రని.. బయటకు రానిచ్చేదే లేదంటూ వ్యాఖ్యానించారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రిహరీశ్ రావు తనదైన శైలిలో స్పందించారు. రేవంత్ రెడ్డి పిచ్చి పిచ్చి డైలాగులు కొడుతుంటడు. నిన్న కేసీఆర్ను పట్టుకొని పశుపతి అంటడు. నువ్వేంటి మరి బూతుపతివా..? నేపాల్లో హిందువులంతా పూజించే పశుపతి దేవాలయం ఉంటది. పశుపతినాథ్ అంటే పశువులను సమస్త జీవకోటి రాశులను కాపాడేటటువంటి శివుడికి ప్రతిరూపం. మరి కేసీఆర్ అంత అద్భుతంగా రైతులను, రైతుల చేతుల్లో ఉండే పాడి పశువులను అందరినీ కాపాడి రాష్ట్రాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసిండు. నువ్వు కేసీఆర్ను పట్టుకొని సినిమా డైలాగులు కొట్టినంత మాత్రాన ప్రజలు నమ్మేపరిస్థితిలో లేరని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డి కేసీఆర్ను పశుపతి అంటున్నాడు
పశుపతి అంటే జీవరాశులను కాపాడే శివుడి ప్రతిరూపం
పశుపతికి నేపాల్ దేశంలో గుడి కూడా ఉంది
నువ్వు సినిమా డైలాగులు కొడితే జనాలు నమ్మే పరిస్థితిలో లేరు
– హరీష్ రావు https://t.co/V4TMUsKO0F pic.twitter.com/Y3V1LK6png
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2026