తిరుమల : తిరుమలలోని వేంకటేశ్వరస్వామి పరిధిలో వివిధ ట్రస్టులకు భక్తులు భారీ విరాళాలను అందజేస్తున్నారు. హైదరాబాద్ ( Hyderabad ) కు చెందిన అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్టుకు రూ.కోటి విరాళాన్ని( Donations) అందజేశారు.
సంస్థ ప్రతినిధులు తరుణ్, రమేష్ మంగళవారం తిరుమలలోని టీటీడీ ఛైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుకు విరాళం డీడీని అందజేశారు. ఈ సందర్భంగా పేద ప్రజల ప్రాణరక్షణకు చేయూతనిచ్చే మహోన్నత సేవలో భాగస్వాములైన అపర్ణ సంస్థ యాజమాన్యాన్ని చైర్మన్ బి.ఆర్. నాయుడు అభినందిస్తూ, వారి దాతృత్వాన్ని కొనియాడారు.
Tirumala |తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల( Tirumala ) లో వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు 80,167 మంది శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ( TTD ) అధికారులు వివరించారు. 28,270 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీకి రూ .4.96 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు. 15 కంపాటుమెంట్లో ఉన్న టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని తెలిపారు.