ఓదెల, జులై 1: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో అద్దె భవనంలో కొనసాగుతున్న జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకు అద్దె చెల్లించడం లేదని భవన యజమాని బుధవారం కోర్టు భవనానికి తాళం వేశాడు. గత ఏడు నెలలుగా ఓదెలలో జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు అద్దె భవనంలో కొనసాగుతుంది.
అయితే ఏడు నెలలు గడిచిన కోర్టు వారు అద్దె చెల్లించడం లేదని ఆగ్రహించిన ఇంటి యజమాని కోర్టు భావనానికి తాళం వేశాడు. అద్దె డబ్బులు అడిగినప్పుడల్లా ఇప్పుడు అప్పుడు అంటూ కాలం వెలదీస్తున్నారని ఇంటి యజమాని ముంజాల మధు ఆరోపించారు. విధిలేని పరిస్థితుల్లో భవనానికి తాళం వేయాల్సి వచ్చిందని తెలిపారు.