హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): ప్రజలను కాపాడిన పోలీసులకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనలో భద్రత కరువైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఏఎస్ఐగా పనిచేసి ఎనిమిది నెలల క్రితం రిటైరైనా, తనకు రావాల్సిన బెనిఫిట్స్ రాలేదని, ఇక తనకు ఆత్మహత్యే శరణ్యం అని ఆవేదన చెందిన సాదిక్ అలీ ఉదంతాన్ని ఆయన ఉదహరించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సర్కార్ తీరుపై హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. సాదిక్ అలీ ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. రేవంత్ పాలన అన్ని వర్గాలతోపాటు రిటైర్డ్ ఉద్యోగులకు శాపంగా మారిందని మండిపడ్డారు. విశ్రాంత జీవితాన్ని కుటుంబసభ్యులతో కలిసి సంతోషంగా గడపాల్సిన రోజుల్లో వారిని మానసిక క్షోభకు గురిచేయడం హేయమైన చర్య అని దుయ్యబట్టారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఏడువేల మంది ప్రభుత్వ ఉద్యోగులు వారికి హకుగా దక్కాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నా పట్టించుకోకపోవడం సర్కార్ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. కోర్టుకు వెళ్లి ఆర్డర్ తెచ్చుకుంటేగాని రిటైర్మెంట్ బెనిఫిట్స్ పొందలేని దుస్థితికి విశ్రాంత ఉద్యోగులను నెట్టడం శోచనీయమని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా రిటైర్మెంట్ ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న బెనిఫిట్స్‌ను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. విజయవంతంగా ఉద్యోగాలు పూర్తిచేసి, జీవితంలో విజయం సాధించామని ఆత్మహత్యలు పరిష్కారం కాదని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండంగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నెట్వర్క్ దవాఖానలకు బిల్లులేవి?
నెట్వర్క్ దవాఖానలకు బిల్లులు చెల్లించక ఉద్యోగులకు, జర్నలిస్టులకు, పోలీసులకు వైద్యం అందించే ఈహెచ్ఎస్, ఈజేహెచ్ఎస్, ఆరోగ్య భద్రత పథకాల సేవలను సైతం అటకెకించే పరిస్థితి నెలకొన్నదని హరీశ్‌రావు ఆందోళన చెందారు. సర్కార్ నిష్రియాపరత్వం కారణంగా అ త్యవసర వైద్యసేవలు అందకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభు త్వం ఇప్పటికైనా కండ్లు తెరిచి వెంటనే బకాయిలు చెల్లించి, ఉద్యోగులు, జర్నలిస్టులు, పోలీసులకు వైద్యసేవలు కొనసాగేలా చూడాలని డిమాండ్ చేశారు.